Home

»

Tv News

BiggBoss 10 Telugu: చరణ్ సపోర్ట్ చేసిన వాళ్ళపై నాగార్జున ఫైర్ అవుతాడా!

Nov 19, 2026 8:02AM

బిగ్ బాస్ 10 లో చరణ్ వ్యవహారం ఇప్పుడు హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డిక్టేటర్‌గా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. హౌస్‌లో కంటెస్టెంట్లను 'ఎక్స్‌పైర్డ్ టాబ్లెట్స్' అంటూ సెటైర్లు వేశాడు. నాగార్జునపై కూడా ఇన్‌డైరెక్ట్‌గా పంచ్‌లు వేశాడు. దీంతో వీకెండ్ ఎపిసోడ్‌లో నాగ్ ఎలా రియాక్ట్ అవుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అసలు ప్రశ్న ఇప్పుడు చరణ్‌పైనే కాదు.. చరణ్‌కి సపోర్ట్ చేసిన వాళ్ళపై నాగార్జున ఫైర్ అవుతాడా‌. అనేదానిపైనే. హౌస్‌లో చరణ్ మాటలకు కొందరు కంటెస్టెంట్లు నవ్వుతూ సపోర్ట్ చేశారు. మరికొందరు చరణ్ చెప్పింది కరెక్టే అంటూ వంత పాడారు. నాగ్ దృష్టిలో ఇది గ్రూప్ గేమ్‌లా కనిపిస్తే.. వారిపై కూడా క్లాస్ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.

గత వీకెండ్‌లలో నాగార్జున స్టైల్ చూస్తే.. తప్పు చేసిన వారిని ఒక్కరినే కాదు, వారిని ఎంకరేజ్ చేసిన వారిని కూడా వదలకుండా ప్రశ్నించడం చూశాం. ముఖ్యంగా హోస్ట్‌పై సెటైర్ వేసిన విషయంలో నాగ్ ఎప్పుడూ సీరియస్‌గానే ఉంటాడు. అందుకే చరణ్‌కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ వారం నాగ్ టార్గెట్‌లో ఉంటారనే చర్చ జరుగుతోంది.మరోవైపు మరికొందరు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. చరణ్ మాజీ కంటెస్టెంట్‌గా వచ్చి తన అభిప్రాయం చెప్పాడు. దానికి హౌస్‌మేట్స్ రియాక్ట్ అవ్వడం సహజమే. దానికే నాగ్ ఫైర్ అవ్వడు.. చరణ్‌ని మాత్రమే నిలదీస్తాడని వారి వాదన. అంతేకాదు.. చరణ్ చెప్పిన పాయింట్స్‌లో నిజం ఉందని నాగ్ కూడా ఒప్పుకుంటే సీన్ రివర్స్ అవుతుందని అంటున్నారు.

ఇక త్రిగుణ్, వంశీ, రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు చరణ్ వ్యాఖ్యలకు ఎలా స్పందించారనేది కూడా వీకెండ్‌లో కీలకం కానుంది. వాళ్ళు చరణ్‌కి సపోర్ట్ చేస్తే నాగ్ వారిని కూడా లాగుతాడా? లేక చరణ్‌ ఒక్కడినే టార్గెట్ చేస్తాడా? అనేది శనివారం ఎపిసోడ్‌లోనే తేలనుంది.ఒకటి మాత్రం క్లియర్. ఈ వీకెండ్ ఎపిసోడ్ చాలా హాట్‌గా ఉండబోతోంది. నాగార్జున ఫైర్ అవుతాడా? లేక సెటైర్లతోనే సరిపెడతాడా? అనేది చూడాలి.

 

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com