Home

»

Tv News

Bigg Boss 10 Telugu: శ్రిష్టి వర్సెస్ వర్షిణి‌.. ముఖేష్‌ వర్సెస్ త్రిగుణ్!

Nov 18, 2026 7:29PM

బిగ్ బాస్ సీజన్-10 లో పదకొండవ వారం నామినేషన్స్‌లో శ్రిష్టి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే వర్షిణిని నామినేట్ చేసింది.

ఒక్క ఫిజికల్ టాస్కు కూడా సరిగ్గా ఆడింది లేదు.. గెలిచింది లేదు.. అసలు నువ్వు టాస్కులు అంటేనే భయపడతావ్.. ముఖేష్ వల్ల నీ పర్సనాలిటీ కూడా కనిపించలేదని వర్షిణిపై శ్రిష్టి ఫైర్ అయ్యింది. నీకు ధైర్యం లేదు.. గేమ్ ఆడటం రాదు.. నువ్వు అసలు వేస్ట్ అంటూ నానామాటలు అంది శ్రిష్టి.

ఆ తర్వాత తన డాగర్‌ని త్రిగుణ్‌కి ఇచ్చింది శ్రిష్టి. దాంతో ముఖేష్‌ని త్రిగుణ్ నామినేట్ చేశాడు. ఎదుటి వాళ్ల ఓటమిలో నీ సంతోషాన్ని వెతుక్కుంటున్నావ్.. నీలాంటి కుళ్లుబోతు ఈ ఇంట్లో ఉండకూడదు.. ఉండేందుకు అర్హత లేదుని త్రిగుణ్ ఘాటుగా అన్నాడు.శ్రిష్టి మాటలకు వర్షిణి షాక్ అవ్వగా, త్రిగుణ్ మాటలకు ముఖేష్ ఫేస్ మారిపోయింది. ఈ నామినేషన్‌తో వర్షిణి, ముఖేష్ ఇద్దరూ నామినేషన్స్‌లోకి వెళ్లారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com