Home

»

Tv News

Bigg Boss 10 Telugu: మిథిలేష్ ఎంట్రీతో ముఖేష్‌కి షాక్.. అమన్ పాటతో హౌస్‌లో నవ్వులు!

Nov 17, 2026 9:24AM

బిగ్ బాస్ ఇంట్లో 11వ వారం నామినేషన్స్‌లో మాజీ కంటెస్టెంట్ల హడావుడి కొనసాగింది. షాలినీ తర్వాత మిథిలేష్ ఎంట్రీ ఇచ్చి ముఖేష్‌ని నామినేట్ చేస్తాడు. సుధీర్ విషయంలో చేస్తోంది తప్పు.. శివ్‌, దేబ్జానీల మీద చేసింది తప్పు అని అంటాడు.

అమన్‌కి మిథిలేష్ డ్యాగర్ ఇస్తాడు. ముకేషా ముకేషా.. మబ్బు ముకేషా అని పాట పాడుతూ వస్తాడు అమన్. నాకు సపోర్ట్ చేస్తానని అన్నావ్.. చివరకు మంచి వాడు అని పేరు తెచ్చుకోవాలని నరేష్‌కి సపోర్ట్ చేశావని పాయింట్ చెప్తాడు.ఆ తర్వాత దక్షి ఎంట్రీ ఇస్తుంది. నీతూని నామినేట్ చేస్తూ.. మీరు ఆర్కేని రక్త కన్నీరు అని అనడం, ముఖేష్‌ని కల్లు తాగిన కోతి అనడం తప్పు.. నేను పాజిటివ్‌గానే బయటకు వెళ్లా.. మనం బయటకు ఎలా వెళ్లాలనేది మన ప్రవర్తన మీదే ఉంటుందని కాస్త చూసుకోండని సలహా ఇస్తుంది దక్షి. హౌస్ లో ఎవరిని నమ్మకూడదని దక్షి చెప్పడంతో హౌస్ లోని వారంతా చప్పట్లు కొడతారు. 

ఆ తర్వాత మళ్లీ త్రిగుణ్‌కే డాగర్ ఇస్తుంది దక్షి. ఈ సారి వంశీని నామినేట్ చేస్తాడు త్రిగుణ్. కెప్టెన్సీలో స్వీట్‌గా ఉన్నావ్.. అందరూ పనులు తప్పించుకున్నారు.. కాస్త స్ట్రిక్ట్‌గా ఉండాల్సిందని అంటాడు త్రిగుణ్.ఈ నామినేషన్స్‌లో త్రిగుణ్, వంశీ కలిసి శివ్‌ పాయింట్స్ చెప్పినట్టుగా అనిపిస్తుంది. మీరిద్దరూ కలిసి శివ్‌ని నామినేట్ చేసినట్టుందని రామ్ ప్రసాద్, నరేష్ కామెడీ చేస్తారు.ఈ వారం నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు నామినేట్ అవుతారు? ఎవరు సేవ్ అవుతారనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com