Home

»

Tv News

నవదీప్ ...నువ్వు నా లైఫ్ మార్చావ్!

Jun 7, 2026 2:52PM

నవదీప్ అన్న పేరుకు అటు మూవీస్ ఇటు బుల్లితెర అంటూ పరిచయం చేయక్కర్లేదు ఎందుకంటే వీటికి మించిన ఐడియోలజీతో ఫ్లై హై అంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్‌గా ఉంటూ ఆకాశంలో ఎగురుతూ ఎంతోమంది యూత్‌కి ఒక ఇన్స్పిరేషనల్ ఐకాన్‌గా ఉన్నాడు. నవదీప్ పెట్టే వీడియోస్ చూస్తే చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటాయి. యూత్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు ఇతని ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని. ఈ వీడియోస్ మధ్యలో రీసెంట్‌గా ఒక ఇంటరెస్టింగ్ స్టోరీని తన ఇన్స్టా స్టేటస్‌లో పోస్ట్ చేసాడు. అదేంటంటే "హే నవదీప్ నేను గత నెల రోజుల నుంచి జిమ్‌కి కచ్చితంగా వెళ్తున్నా. ఇప్పుడు జిమ్‌కి నేను ఎడిక్ట్ అయిపోయాను. మెంటల్‌గా కూడా నాకు జిమ్ ఎంత హెల్ప్ చేసింది. అలాగే రోజంతా ఎనేర్జిగా ఉంచుతోంది. శారీరకంగా మానసికంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. అసలు జిమ్ కి వెళ్ళడానికి అవకాశం ఇవ్వని మా నాన్నే స్వయంగా నా జిమ్ టైం అయిపోయాక‌ వచ్చి మరీ పిక్ చేసుకుంటున్నారు. నిజంగా ఈ విషయం గురించి మాటల్లో చెప్పలేదు. ఇది నాకు చాలా పెద్ద విషయం. 30 ఏళ్ళ వయసులో పేరెంట్స్‌తో ఉండడం అంటే అంత సులువైన విషయం కాదు అందులోనూ మా నాన్న జిమ్‌కి వచ్చి నన్ను పికప్ చేసుకోవడం చూస్తుంటే నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. నువ్వు చెప్పిన మాటలను విని నేను జిమ్‌లో చేరాను. నన్ను ఇలా మోటివేట్ చేసినందుకు చాలా సంతోషం. హ్యాపీ సండే" అంటూ ఆమె తనను మోటివేట్ చేసిన హీరో నవదీప్ గురించి ఆమె మాటల్లో చెప్పేసరికి నవదీప్ కూడా ఆసమ్‌ ...అంటూ స్టోరీ పోస్ట్ చేసాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com