ENGLISH | TELUGU  
Home  » TV News

పుట్టింటికి వెళ్లిన ముకుంద.. తన గురించి భవాని ఆందోళన!

on May 19, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -160 లో.. ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ చెప్పిన మాటలన్నీ మురారి గుర్తుచేసుకుంటాడు. అప్పుడే కృష్ణ వెనకాల నుండి వచ్చి మురారిని భయపెడుతుంది. ఏంటి కృష్ణ.. ఈ అల్లరి ఇంట్లో పరిస్థితేంటి.. నువ్వు చేస్తుందేంటి.. ఇలా పెద్దమ్మ వెళ్లే ముందు ముకుంద వాళ్ళ నాన్న వచ్చి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని కృష్ణతో మురారి అంటాడు.

ముకుంద వాళ్ల నాన్న అలా మాట్లాడడం కరెక్టే.. ఒక తండ్రిగా అతను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. ఎన్ని రోజులు ముకుంద అలా ఒంటరిగా ఉంటుంది. తనకి కోరికలు.. ఆశలు ఉండవా.. మళ్ళీ ముకుందకి పెళ్లి చెయ్యాలని కృష్ణ అంటుంది. అయ్యో కృష్ణ ముకుంద నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది.. నీకెలా చెప్పాలని మురారి తన మనసులో అనుకుంటాడు.

మరొకవైపు ముకుంద వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. శ్రీనివాస్ చూసి.. నువ్వు ఎప్పుడు వచ్చావని అడుగుతాడు. ఇన్ని రోజులు మీ కూతురు ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటుందని గుర్తు రాలేదా.. ఇప్పుడు వచ్చి తీసుకెళ్తా అని అంటున్నారని ముకుంద అనగానే.. నువ్వే కదమ్మా రానని అన్నావని శ్రీనివాస్ అంటాడు. నేను మురారి ఒకప్పుడు లవర్స్ అని తెలిసి కూడా.. నాకు ఆదర్శ్ తో పెళ్లి చేశారు.. అయినా నేను మురారిని మర్చిపోలేదు. నేను మురారి భార్యగా ఉంటాను.. లేదంటే ఆదర్శ్ భార్యగా మనసు చంపుకొని ఉంటాను అంతే కానీ ఇంకో పెళ్లి చేస్తానని అనకండని ముకుంద అంటుంది.

నాకు తప్ప తన మనసులో ఎవరికీ స్థానం ఇవ్వనని మురారి మాటిచ్చాడు. కృష్ణ, మురారిలది ఒక అగ్రిమెంట్ మ్యారేజ్ మాత్రమే.. కృష్ణ చదువు అవ్వగానే వెళ్లిపోతుంది. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు.. కృష్ణ వెళ్ళిపోగానే మురారిని నేను పెళ్లి చేసుకుంటానని ముకుంద అంటుంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మురారి రెడీగా ఉన్నాడా అని శ్రీనివాస్ అడుగుతాడు. లేడు మీరే మురారితో నా పెళ్లికి ఒప్పించాలని ముకుంద అంటుంది. మరొకవైపు రేవతికి భవాని ఫోన్ చేసి నేను వచ్చే వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకో.. నేను వచ్చే ముందు శ్రీనివాస్ గారు అలా మాట్లాడారు కదా అసలు ముకుంద మనసులో ఏముందో తెలుసుకోమని రేవతితో అంటుంది భవాని. దానికి రేవతి సరేనని అంటుంది.

మరొకవైపు వర్క్ చేసుకుంటున్న మురారి దగ్గరికి కృష్ణ టిఫిన్ తీసుకొని వచ్చి ప్రేమగా తినిపిస్తుంది.. అలా తినిపించడం చూసిన భాను వీడియో తీస్తూ అలానే తినిపించుకోండి.. ఈ వీడియో సోషల్ మీడియాలో పెడితే బాగా వ్యూస్ వస్తాయి.. మురారి నువ్వు కృష్ణకి ప్రపోజ్ చేయు అని భాను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.