కొంపముంచిన వంటగది.. బేబక్క ఎలిమినేషన్ కి కారణమిదేనా!
on Sep 9, 2024
బిగ్ బాస్ ఫస్ట్ వీక్ లో మొదటి ఎలిమినేషన్ గా బేబక్క హౌస్ నుండి బయటకు వచ్చేసింది. తను యాక్టివ్ అవుతుందనుకున్న సమయంలో ఇలా బయటకు పంపించేశారంటు ప్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇక హౌస్ లోకి వెళ్ళేముందు బేబక్క ప్రోమో చూసిన అందరు.. ఈ సీజన్ ఎంటర్‌టైన్మెంట్ మాములుగా ఉండదనుకున్నారు. కానీ హౌస్ లోకి వెళ్ళాకా అంతా రివర్స్ అయ్యింది. యాక్టివ్ తో పాటు జోక్స్, ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుందని అనుకున్నారంతా.. కానీ అదేమీ లేదు. తనకి స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా రాదు. ప్రతి సీజన్‌లోనూ యంగ్ బ్యాచ్‌తో పాటు ఓ ఆంటీని కూడా కంటెస్టెంట్‌గా తీసుకుంటారు. ఈ సీజన్‌లో బేబక్కని అదే కోవలో ఎంపిక చేశారు. ఫస్ట్ సీజన్ సింగర్ కల్పన.. ఆ తరువాతి సీజన్లలో కరాటే కళ్యాణి, నటి హేమ, ఉమాదేవి వీళ్లందర్నీ కూడా ఇలాగే తీసుకున్నారు. వాళ్లందర్నీ తొలివారంలో హౌస్ నుంచి బయటకు పంపారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. వీళ్లంతా రావడం రావడమే.. వంటగదిలోకి వచ్చి గరిటె తిప్పిన వాళ్లే. కాబట్టి.. ఈ సీజన్‌లో ఇదే సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తూ అదే ఏజ్ గ్రూప్ ఉన్న బేబక్కని హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఈమె కూడా రావడం రావడమే కిచెన్‌లోకి వెళ్లింది.. తొలివారంలోనే ఎలిమినేట్ అయ్యింది.
అయితే ఓటింగ్ పరంగా బెజవాడ బేబక్కకి అన్యాయం జరిగింది. సాధారణంగా మొదటి వారం నో ఎలిమినేషన్ ఉంటుంది కానీ బేబక్కని ఎలిమినేషన్ చేశారు. ఇది అన్ ఫెయిర్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి మీకేనపిస్తుంది కామెంట్ చేయండి.
Also Read