మూడవ హౌజ్ మేట్ కోసం పోటీపడుతున్న ఆ ముగ్గురు!
on Sep 22, 2023
బిగ్ బాస్ సీజన్-7 అట్టహాసంగా ప్రారంభమైంది. గత సీజన్ తో పోల్చితే ఈ సీజన్ గట్టిగానే వర్కవుట్ అయిందని చెప్పాలి. హౌజ్ లోకి మొత్తంగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో నుండి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీల బయటకొచ్చేశారు. ప్రస్తుతం మూడవ వారం జరుగుతుంది. ఈ వారం కంటెండర్ షిప్ కోసం జరిగే పోటీలు మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
ఈ సారి ఉల్టా పల్టా థీమ్ తో బిగ్ బాస్ మతిపోగెట్టుస్తున్నాడు. అయితే ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో గేమ్ ప్లాన్ తో హౌజ్ లో మెల్లి మెల్లగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవుతున్నారు. నిన్న మొన్నటి దాకా నామినేషన్ లో లేని ప్రియాంక జైన్ అసలు హౌజ్ లో ఉందా లేదా అని అనుకున్నారంతా కానీ గురువారం జరిగిన ఎపిసోడ్‌లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినట్టుగా రేస్ లోకి వచ్చింది. గత నాలుగు రోజుల నుండి సాగుతున్న కంటెండర్ షిప్ కోసం హౌజ్ లోని కంటెస్టెంట్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మూడవ హౌజ్ మేట్ కోసం బిగ్ బాస్.. అమర్ దీప్, యావర్, శోభా శెట్టి లని ముగ్గురిని సెలెక్ట్ చేశాడు. అయితే వీరిని హౌజ్ లోని మిగతా వాళ్ళలోని కొందరు వద్దని అపోజ్ చేశారు. దీంతో బిగ్ బాస్ అపోజ్ చేసిన వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు.
ఇప్పటికీ యావర్ మూడవ హౌజ్ మేట్ కోసం జరిగే పోటీకి ఎంపిక అయ్యాడు. శోభా శెట్టి కారం ఎక్కువగా ఉన్న చికెన్ పీస్ లని తిని తను పోటీకి ఎంపిక అయింది. ఇక అమర్ దీప్, ప్రియాంక జైన్ ఇద్దరికి బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. ఎవరైతే తమ జుట్టుని త్యాగం చేస్తారో వారే మూడవ హౌజ్ మేట్ కోసం జరిగే పోటీకి అర్హులని బిగ్ బాస్ కోరగా.. తనకి ఇష్టమైన హీరో రవితేజ అని, తన జుట్టు మీద ఇలా చేయి చేసి బాగుందని అన్నాడని, నేను నా జుట్టుని తీయనని అమర్ దీప్ అంటాడు. అది విన్న టేస్టీ తేజ.. కొన్ని రోజులకి నీ జుట్టు నీకు వస్తుందిలే అని అన్నాడు. ఇక అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య కాసేపు చర్చల తర్వాత అమర్ దీప్ త్యాగం చేస్తున్నానని పోటీ నుండి తప్పుకుంటున్నట్టుగా బిగ్ బాస్ కి చెప్తాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ హెయిర్ కట్ చేయించుకొని మూడవ హౌజ్ మేట్ కోసం జరిగే పోటీకి అర్హతను సాధించింది. ఇక ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ లకి ఈరోజు(శుక్రవారం) పోటీ జరుగుతుంది. వీరి ముగ్గురిలో మూడవ హౌజ్ మేట్ ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
