Home

»

Tv News

Bb jodi season 2: బిబి జోడిలో పొదరిల్లు పాప... ఫిదా ఐపోయిన జడ్జెస్..ఐ లవ్ యు చెప్పిన సాయి

Mar 04, 2026

 


బిబి జోడి సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. తీన్మార్ స్పెషల్ థీమ్ తో రాబోతోంది.  ఫేవరేట్ జోడీలతో పాటు  ఫేవరేట్ యాక్టర్స్ కూడా ఈ స్టేజి మీద పెర్ఫార్మ్ చేయబోతున్నారంటూ ప్రదీప్ అనౌన్స్ చేసాడు . ఇంతలో అందమైన గెటప్ తో కృతిక వచ్చింది. "స్టార్ మాలో టాప్ హీరోయిన్ తను.  పొదరిల్లు అనే టాప్ సీరియల్ లో నటిస్తోంది"  అని ఇంట్రడ్యూస్ చేసాడు . సదా ఆశర్యపోయింది. ఇక ఇమ్మానుయేల్ ఐతే "ఓహ్ పొదరిల్లు.. ఐతే ఆ ఎదురిల్లు మనదే" అన్నాడు. "అవునా ఐతే నువ్వు ఆ ఎదురింట్లోనే ఉండు" అన్నాడు. "ప్రాక్టీస్ అప్పుడు  బాగా ఉన్నారామ్మా" అని ప్రదీప్ అడిగాడు. "అన్న లాగా బాగా చూసుకున్నారు" అంటూ అమరదీప్ గురించి చెప్పేసరికి అమర్ షాకైపోయాడు. 


వెంటనే  బామ్మరిది అంటూ పిలిచాడు ఇమ్ము.  "కళ్ళజోడు అలాగే ఉంచు ఏడిచేది కనిపించకూడదు" అన్నాడు ప్రదీప్. ఇక కృతిక అమర్ తో కలిసి క్యూట్ గా డాన్స్ చేసింది. దాంతో సదా ఫిదా ఐపోయింది.  "అమర్ ఎంత లక్కీ అంటే ఇద్దరు అందమైన అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నాడు" అంటూ శ్రీదేవి పొగిడేసింది. ఇక సాయి శ్రీనివాస్ ఐతే "కృతిక ఐ లవ్ యు" అని చెప్పాడు. "సీజన్ స్టార్టింగ్ లో నయని పావనికి కూడా సేమ్ చెప్పాడు" అంటూ నైనికా చెప్పేసరికి "అందుకే నయని వెళ్ళిపోయింది" అన్నాడు సాయి శ్రీనివాస్. ఇక అందరికీ ఇష్టమైన రాము రాథోడ్ కూడా ఈ షోకి వచ్చి సాయి శ్రీనివాస్ - సీతకి జోడిగా డాన్స్ చేసాడు. ఆ డాన్స్ అందరికీ నచ్చేసింది. ఫ్లోర్ మీద వేవ్ మూమెంట్స్ చేసిన సాయి శ్రీనివాస్ ని శేఖర్ మాష్టర్ కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. "సాయి శ్రీనివాస్ థియేటర్‌లో బన్నీ గారు వేవ్ చేస్తున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశానో  సీరియస్ లి లిటరల్లీ అంత  పర్ఫెక్ట్ గా వచ్చింది" అని చెప్పారు.  సీత ఫ్లోర్ మూమెంట్స్ చూసి  " నిజంగా సీత అసలు ఎక్స్పెక్ట్  చేయలేదు. " అంటూ శ్రీదేవి పొగిడేసింది.  ఫైనల్ గా రాము రాథోడ్ సాంగ్ "రాను బొంబాయి కి రాను" సాంగ్ కి జడ్జెస్ అంతా డాన్స్ చేశారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com