
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamud).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -970 లో... అపర్ణ కిచెన్ లోకి వచ్చేసరికి తినడానికి ఏం ఉండదు. అప్పుడే రేఖ ఆడపడుచు భ్రమరాంబ వచ్చి.. ఎక్కువ తినొద్దు డైటింగ్ చెయ్యాలని అంటుంది. ఈ ఇంట్లో నా పర్మిషన్ లేకుండా ఏం చెయ్యొద్దని భ్రమరాంబ పనిమనిషికి చెప్తుంది. ఆ తర్వాత కావ్య పాప ఇందు, అప్పు పాప నందు ఇద్దరు బొమ్మలతో ఆడుకుంటుంటే స్వప్న పాప ఐశ్వర్య వచ్చి లాక్కుంటుంది. ఏంటి అక్క అలా చేసావని ఇందు అడుగుతుంది. ఇవి మా రేఖ ఆంటీ కొనిచ్చింది.. మీరు నా బొమ్మలతో ఆడుకోవద్దని అంటుంది.
అప్పుడే రేఖ వచ్చి మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి అని వార్నింగ్ ఇస్తుంది. ఏంటి పిల్లల్లో కూడ విషాన్ని నింపుతున్నావని అపర్ణ కోప్పడుతుంది. ఆ తర్వాత ఇందు, నందు డల్ గా ఉంటే భ్రమరాంబ కూతురు స్వాతి వచ్చి అక్క ఈ బొమ్మలు నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు.. ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలియదు.. మీరు ఆడుకోండి అని అంటుంది. దాంతో ముగ్గురు ఆడుకుంటారు. ఆ తర్వాత రేఖ ఇంటికి గెస్ట్ వస్తున్నారని వంటకాలు చేయిస్తుంది. టేబుల్ పై వున్నా వాటిని నందు తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే రేఖ వచ్చి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా అని కోప్పడుతుంది. నీకు ఇలా కదంటూ వెళ్లి వాత పెడుతుంది. రేఖపై అపర్ణ కోప్పడుతుంది. అదంతా నందు మనసులో పెట్టుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. సారీ అక్క నానమ్మ నేను బయటకు వెళ్లి బాగా చదువుకోవాలి పోలీస్ అవ్వాలి.. వచ్చి ఈ రేఖ సంగతి చెప్తానని వెళ్ళిపోతుంది.
నందు ఒక కానిస్టేబుల్ కి కనిపిస్తుంది. ఇంటికి తిరిగి వెళ్ళు అని అతను చెప్తాడు కానీ నందు ఆ కానిస్టేబుల్ వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత నందు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన విషయం ఇందు, అపర్ణకి తెలిసి బాధపడతారు. ఇందు దగ్గరికి స్వాతి వచ్చి ఆ చెల్లి వచ్చేవరకు నేను నీ చెల్లిని అని స్వాతి చెప్తుంది. మరొకవైపు కానిస్టేబుల్ ఇంట్లో నుండి బయటకు వచ్చేసరికి నందు భయట పడుకొని ఉంటుంది. ఎవరమ్మా నువ్వు మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. అవేం చెప్పను.. నేను పోలీస్ అవ్వాలి.. ఆ రేఖ ఆంటీ సంగతి చెప్పాలని నందు అనగానే మీ పేరెంట్స్ ఎవరు అని అంటాడు. మా పేరెంట్స్ లేరని పాప చెప్పగానే నందుని కానిస్టేబుల్ తన దగ్గర ఉంచుకొని చదివిస్తాడు. కొన్ని రోజులకి అపర్ణ ప్రొద్దున లేచి పనులు చెయ్యాలని అనుకుంటుంది. అప్పుడే ఇందు లేచి నేను చేస్తాను నానమ్మ అని చకచకా అన్ని పనులు చేస్తుంది. తరువాయి భాగంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఇందు ఇంట్లో పనులు చేస్తుంటే రాహుల్, రుద్రాణి ఫోటో కిందపడుతుంది అది రేఖ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






