
ఆట ప్రోమో ఒక వైపు జడ్జ్ రాధికా జోష్ మరో వైపు. ఇక లేటెస్ట్ ప్రోమో చూస్తే తనుశ్రీ చేసిన "ఆకాశం ఏనాటిదో" అనే సాంగ్ ని జడ్జ్ రాధికా ఫుల్ ఎంజాయ్ చేసినట్టే ఉంది. ఈ షో కి గెస్ట్ గా వచ్చిన హరీష్ శంకర్ ఐతే "ఈ సాంగ్ కి డాన్స్ చేయొచ్చని నేను కలలో కూడా ఊహించలేదు" అన్నారు. ఎందుకంటే అసలు మూవీలో ఈ సాంగ్ కి డాన్స్ అనేదే ఉండదు. జస్ట్ హీరోయిన్ ఎక్స్ ప్రెషన్స్ తప్ప. "చాలా ఎంజాయ్ చేసి చేశారు . డాన్స్ కి అదే ఇంపార్టెంట్ " అంటూ రాధికా చెప్పారు. "నీహా పాప బడ్జెట్ కూడా బానే ఇస్తున్నట్టుంది. వెనకాల పూలు గీలు అన్ని అదరగొట్టేసారు" అంటూ హరీష్ శంకర్ నిహారికకు తెగ మెచ్చుకున్నాడు . "భారతిరాజా గారి హీరోయిన్స్ కి ఒక స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది.
సాంగ్ తీసేటప్పుడు ఇలాంటి మూమెంట్స్ చేయాలి" అంటూ బుగ్గ మీద చేతులేసుకుని రాధికా సిగ్గుపడుతూ చూపించింది . "సిగ్గంటే తెలీదు సో వాళ్ళు చాలా కష్టపడ్డారు. రెండోది చనిపోయినట్టు నటించాలంటే అప్పుడే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది." అంటూ తన మెమోరీస్ ని షేర్ చేసుకున్నారు. ఇంతలో సుధీర్ " హరీష్ శంకర్ గారు ఇక్కడే ఉన్నారు. సో ఆయన డైరెక్షన్లో ఒకసారి సిగ్గుపడితే ఎలా సిగ్గుపడతారో చూపించండి" అంటూ కామెడీగా రాధికను అడిగాడు. "ఆయన పిక్చర్ లోనా ఇలా అంటూ కళ్ళజోడు పెట్టుకుని మెడ మీద చెయ్యేసుకుని చూపించారు. " ఒక యాటిట్యూడ్ తో పవన్ కళ్యాణ్ గారి మేనరేజం ఉంటది కదా అలా యాక్షన్ " అని చెప్పాడు హరీష్ శంకర్. రాధికా చేసి చూపించారు. " లేడీ పవన్ కళ్యాణ్ ని చూసినట్లే ఉంది " అంటూ కితాబిచ్చాడు హరీష్ శంకర్.







