శ్రీసత్య గురించి క్లారిటీ ఇచ్చిన అర్జున్ కళ్యాణ్..!
on May 4, 2023

అర్జున్ కళ్యాణ్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికి పరిచయమయ్యాడు. శ్రీసత్య అంటే గురించి మాట్లాడితే అర్జున్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ లో శ్రీసత్య వెంటే ఉంటూ.. తనతోనే ఎక్కువ టైం గడిపేవాడు. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ ఎంట్రీకి ముందు ఒక వెబ్ సీరీస్ లో యాక్ట్ చేసాడు.. అది కూడా ఎక్కువ పాపులారిటీ రాకపోయేసరికి ఎవరికి ఎక్కువగా తెలియలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో బాగా ఫేమస్ అయ్యాడు. శ్రీసత్య కోసం తన గేమ్ ని కొన్ని సందర్బాలలో త్యాగం చేసాడు. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ కి రావడం కూడా.. శ్రీ సత్య వల్లే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అర్జున్ కళ్యాణ్.
బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక కూడా శ్రీ సత్య వల్లే బయటకు వచ్చాడంటూ అప్పట్లో ఒక న్యూస్ కూడా వైరల్ అయింది. అయితే తాజాగా జరిగిన బిబి జోడి షోలో అర్జున్ కళ్యాణ్ కి జోడిగా శ్రీ సత్య వస్తుందనే వార్తలు వినిపించినా.. చివరికి వసంతి కృష్ణన్ తో జత కట్టాడు. మరొక జోడిగా మెహబూబ్ తో శ్రీ సత్య జత కట్టింది. బిబి జోడీలో కూడా శ్రీసత్య, అర్జున్ ల మధ్యలో ఏదో ఉన్నట్లుగా.. జడ్జెస్, యాంకర్ శ్రీముఖి కూడా సరదాగా ఆటపట్టించారు. కానీ శ్రీసత్య మాత్రం.. అర్జున్ పై ప్రేమ లేదని, ఒక ఫ్రెండ్ అంటూ చెప్పింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అర్జున్ మాట్లాడతూ.. మా మధ్య ఏం లేదు.. బిగ్ బాస్ లో నేను శ్రీ సత్య విషయంలో చేసింది ఎంటర్టైన్మెంట్ కోసమే చేసామంటు చెప్పాడు. అయితే ఈ ఇంటర్వ్యూకి ముందు.. ఒకానొక సందర్భంలో శ్రీసత్య కోసమే బిగ్ బాస్ కి వచ్చానట్టు.. తను ఎక్కడుంటే అక్కడే ఉండాలని.. బిగ్ బాస్ లోకి రావడానికి చాలా కష్టపడ్డాడని, తనతో కలిసి ఉండటానికి బిగ్ బాస్ షోకి వచ్చినట్టు అర్జున్ కళ్యాణ్ చెప్పాడు.
అంతేకాకుండా తన ఇన్ స్టాగ్రామ్ లో.. బిగ్ బాస్ లో శ్రీసత్య, అర్జున్ లు కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేసాడు. ఆ ఫోటోలకి ఫ్రెండ్ షిప్ సాంగ్ ఒకటి ఆడ్ చేసి.. ట్రూ ఫ్రెండ్ షిప్ నెవెర్ ఎండ్స్ అనే కాప్షన్ తో పోస్ట్ చేసాడు అర్జున్. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన తన అభిమానులు మాత్రం వేరేరకంగా అనుకుంటున్నారు. కాగా అర్జున్ కళ్యాణ్ కి తన ఇన్ స్టాగ్రామ్ కి బ్రాండ్ ఇమేజ్ రావడంతో తన హ్యాపీ నెస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. అయితే శ్రీసత్యతో తనకున్న రిలేషన్ ఏంటని ఆన్ స్క్రీన్ వారిద్దరిని చూసిన ప్రేక్షకులకే తెలియాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



