.webp)
బుల్లితెర మీద అష్షు రెడ్డి అంటే తెలియని వాళ్ళు లేరు. రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసి ఫుల్ పాపులర్ అయ్యింది. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. అలాగే బుల్లితెర మీద సుడిగాలి సుధీర్ తో కలిసి ఫామిలీ స్టార్స్ షో చేస్తోంది. ఇటీవల సుప్రీతా పాడ్ కాస్ట్ లో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను కూడా చెప్పుకొచ్చింది. సుధీర్ తో పెళ్లి త్వరలో అంటూ కూడా కామెడీ చేసి కాసేపు సుధీర్ ఫాన్స్ అటెంషన్ ని తనవైపుకు తిప్పుకుంది. అలాంటి అష్షురెడ్డి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో కొన్ని క్యూట్ పిక్స్ ని రీసెంట్ గా పోస్ట్ చేసింది. అలాగే ఒక కొటేషన్ కూడా పెట్టుకుంది. "మీరు ఒక రాయిని చూస్తున్నారు " అంటూ రెడ్ హార్ట్ ఎమోజిని పోస్ట్ చేసింది.
ఇక నెటిజన్స్ ఐతే అష్షు క్యూట్ పిక్స్ చూసి రిప్లైస్ కూడా ఇచ్చారు. "బెస్ట్ గర్ల్ ఇన్ యూనివర్స్. నైస్ గర్ల్ అష్షు. డాల్ అష్షు. క్యూట్ అండ్ ప్రెట్టీ. నా మనసును దోచుకున్నావు. ఫామిలీ స్టార్స్ చూస్తూ ఉంటాను అక్కా. మీకు నేను పెద్ద ఫ్యాన్. సుధీర్ అన్న ఎలా ఉన్నారు. మెస్మరైజింగ్ బ్యూటీ" అంటూ కొంతమంది ఆమెను పొగిడేశారు. ఐతే ఇన్ని మెసేజెస్ లో ఒక రిప్లై ఇంటరెస్టింగ్ గా ఉంది. "నీకు గుడి కట్టినా తక్కువేరా బాబు.." అని నెటిజన్ పెట్టేసరికి "పూజారి నువ్వేనా " అంటూ అష్షు కూడా అడిగింది. "నేనేగా మరి " అంటూ మళ్ళీ రివర్స్ రిప్లై ఇచ్చారా నెటిజన్. ఇక బ్లాక్ వైట్ చెక్స్ తో క్యూట్ ఉన్న కాస్ట్యూమ్ ఫోటో షూట్ తో అష్షు ఆడియన్స్ ని మరో సారి మెస్మోరైజ్ చేసింది. గతంలో హే పిల్ల అనే సాంగ్ చేసింది. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే ప్రమోషనల్ వీడియొ సాంగ్ కూడా చేసింది.






