యాంకర్ రవి ఎక్కడా తగ్గడం లేదుగా
on Dec 16, 2021

యాంకర్ రవి అనూహ్యంగా బిగ్‌బాస్ సీజన్ 5 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా రవి ఎలిమినేట్ కాండం పలువురిని షాక్ కు గురిచేసింది. అతని ఎలిమినేషన్ అక్రమమని, అన్యాయమని అతన్ని కావాలనే ఇంటి నుంచి పంపించారని చాలా మంది బిగ్‌బాస్ నిర్వాహకులపై రవి ఫ్యాన్స్ దుమ్మెత్తిపోశారు. కొంత మంది నెటిజన్స్ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: అక్షరం రాయాలంటే వణుకు పుట్టాలే
అయితే ఈ ఎపిసోడ్ లో కొంత మంది పనిగట్టుకుని మరీ యాంకర్ రవిని, అతని కుటుంబ సభ్యులని టార్గెట్ చేస్తూ నెట్టింట ట్రోల్ చేయడం... అసభ్య పదజాలంతో కించపరచడం జరిగింది. దీనిపై యాంకర్ రవి తగ్గేది లే అంటూ యుద్ధానికి దిగాడు. తనని టార్గెట్ చేసిన ప్రతీ ఒక్క అకౌంట్ ని పరిశీలించి ఆ వివరాలని పోలీసులకు అందజేయడం ఆసక్తికరంగా మారింది.
తన భార్య, కూతురు తో పాటు తనపై తన ఇంటి సభ్యులపై నెటిజన్ లు కొంత మంది అసభ్య పదజాలంతో చేసిన దూషణలపై సీరియస్ అయిన యాంకర్ రవి వారి భరతం పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో సైబర్ పోలీసుల్ని ఆశ్రయించిన ఆయన వారికి తనని టార్గెట్ చేసిన అకౌంట్ ల తాలూకూ వివరాల్ని తాజాగా అందించాడు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన సైబర్ క్రైమ్ పోలీసులకు యాంకర్ రవి ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోని ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశాడు. ఇప్పుడది నెట్టింట వైరల్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



