డిస్కవరీ ఛానల్ లో తప్ప అన్ని ఛానెల్స్ లో హోస్ట్ చేసింది సుమ...
on Apr 21, 2025
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షో ఫైనల్ కి వచ్చేసింది. గ్రాండ్ ఫినాలేకి మూడు జోడీలు వెళ్లాయి. ఆ మూడు జోడీలు ఎవరంటే అమర్ దీప్ - అంబటి అర్జున్, యాదమ్మ రాజు - సుప్రీతా, ప్రష్షు - ధరణి. ఇక గ్రాండ్ ఫినాలేలో ఈ మూడు జోడీలకు టాస్కులు గట్టిగానే ఇచ్చారు. 7 ఐటమ్స్ చేయాలి అంటూ చెప్పింది. సమీరా భరద్వాజ్ - దీపికా అలాగే ప్రసాద్ - విరాజిత ఎలిమినేట్ అయ్యారు. ఇక దీపికా ఐతే "నాకు కప్పు ఇవ్వని వాళ్ళను చంపుతా" అంటూ సుమని బెదిరించింది. ఇక ఈ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా యాంకర్ రవి రావడంతో ఎంటర్టైన్మెంట్ ఇంకొంచెం పెరిగింది. ఈ షో గురించి చెప్పడానికి వచ్చాను అంటూ పాకెట్ లోంచి కళ్ళజోడు పెట్టుకున్నాడు. దాంతో సుమ "ఏంటి కళ్ళజోడు స్టేజికి వచ్చేసావా " అని రవి పరువు తీసేసింది సుమ. "ఎన్నో ఏళ్లుగా డిస్కవరీ ఛానల్ లో తప్పా ఏ ఛానెల్ పెట్టినా కనిపిస్తూ అలరిస్తున్నారు మన సుమ గారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా ఆగకుండా మాట్లాడిన సుమకి మాటలు రాకుండా చేసిన ఘనత మన కంటెస్టెంట్స్ దే...అల్లాడిపోతున్నాడమ్మా అంటూ వచ్చి దీపికా ధాటికి తానే అల్లాడిపోయింది సమీరా..ఇక దీపికా గురించి చెప్పాలి అంటే ఒక వైపు స్టవ్ కి మరో వైపు మనుషులకు ఒకేసారి మండేలా చేస్తుంది ఈ దీపికా..బొగ్గులతో ఎంట్రీ ఇచ్చినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది...అంతా బొగ్గే అని ..అమ్మాయి కలకండ..వీడు కలరా ఉండా..." అంటూ సమీరా - దీపికా, ప్రసాద్ - విరాజిత, యాదమ్మ రాజు - సుప్రీతా గురించి చెప్పాడు రవి. "ఇది వంట షో కదా వంట చేయొచ్చు అని ఒప్పుకున్నావా లేదంటే సుప్రీతా పక్కన కాసేపు నిల్చోవచ్చనా" అని అడిగాడు రవి. "నిజం చెప్పాలంటే సుప్రీతా ఉందనే ఒప్పుకున్నా..." అని యాదమ్మ రాజు తన ప్రేమను చెప్పేసరికి సుప్రీతా ఒక్క క్షణం అలా ఏమీ మాట్లాడకుండా "స్టెల్లా చూస్తున్నావు కదా" అంది. వెంటనే సుమా లైన్ లోకి "ఏంటి సుప్రీతా నీకు యాదమ్మ రాజుకు మధ్య కెమిస్ట్రీ ఉందనే ఫీలవుతున్నావా" అని అడిగింది. వెంటనే సుప్రీతా "ఛి ఛి" అనేసింది. దాంతో రాజు మరీ అంత చెండాలంగా ఉన్నానా అన్నట్టుగా ఫేస్ పెట్టాడు. ఆ తర్వాత జడ్జెస్ సుమ - జీవన్ కలిసి వంటల రుచి చూసి విన్నర్ ని అనౌన్స్ చేశారు. మరి విన్నర్ ఎవరు అనేది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. ఇక ఈ ప్రోమో లాస్ట్ అన్నీ జోడీస్ కలిసి భోజనం చేసి ఎంజాయ్ చేశారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
