రష్మీ,అనసూయ మధ్య విభేదాలు..జబర్దస్త్ సెలెబ్రేషన్స్ లో రష్మీ కన్నీళ్లు
on Aug 6, 2025
.webp)
జబర్దస్త్ 12 ఇయర్స్ మెగా సెలెబ్రేషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సెలెబ్రేషన్స్ కి అలనాటి జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఒక చోట చేరారు. అలాగే వెళ్లిపోయిన జడ్జెస్ కూడా తిరిగి వచ్చారు. కానీ రోజా, సుధీర్ మాత్రం ఈ సెలెబ్రేషన్స్ లో కనిపించలేదు. ఇక ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అనసూయ - రష్మీ ప్యాచప్. గతంలో అనసూయ, రష్మీ ఈ షోకి యాంకర్స్ గా చేసిన విషయం తెలిసిందే. ఐతే అనసూయ కొన్ని కారణాల వలన అలాగే మూవీ ఆఫర్స్ కారణంగా జబర్దస్త్ హోస్ట్ గా బై చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ప్లేస్ లో రష్మీ వచ్చింది. అప్పటి నుంచి రష్మీ కంటిన్యూ అవుతూనే ఉంది.
ఇక ఇప్పుడు ప్రోగ్రాంలో రష్మీ, అనసూయ ఎమోషనల్ అయ్యారు. "జీవితం బోలెడన్ని అవకాశాలు ఇవ్వదు అంటారు కానీ తప్పకుండ ఇస్తుంది. నేను కొంతమందితో ప్యాచప్ చేసుకోవాలి" అంటూ లేచి వెళ్లి రష్మీని హగ్ చేసుకుంది. దాంతో ఆమె ఏడ్చేసింది. "నిజానికి ఎవరికీ తెలియనివి కొన్ని అందరికీ తెలిసిపోయేలా ఉన్నాయి మన ప్యాచప్ వలన..ఓ అదే మీ ఇద్దరూ మాట్లాడుకోరా" అంటారు. దాంతో రష్మీ వెంటనే "అదేదో వాట్సప్ లో కానీ ఫోన్ చేసి ఉంటే ఐపోయేది కదా" అని చెప్పింది. వెంటనే అనసూయ "అలా ఫోన్ లో మాట్లాడితే చాలా ఈగోలు అడ్డొస్తాయి.. ఇలా ఐతే" అంటూ నవ్వేసింది. ఐతే వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నట్టు చూడలేదు. వీళ్ళ మాటలను బట్టి వీళ్ళు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం లేదు అనే విషయం తెలుస్తోంది. ఐతే ఎందుకు వీళ్ళు మాట్లాడుకోవడం లేదు అనే విషయం రాబోయే ఎపిసోడ్ లో తెలిసే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



