ప్రాకృతికి ఇచ్చిపడేసిన అమర్ దీప్...
on Apr 19, 2025
డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మానస్ కి ప్రాకృతికి మధ్యలో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే మానస్ మొదట్లో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు తర్వాత వైల్డ్ కార్డు ద్వారా తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఐతే కొత్త కంటెస్టెంట్ సాగరికతో వచ్చాడు. మానస్ ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి రాబట్టుకున్నాడు. డాన్స్ తో దుమ్ము దులిపి ఆరేసాడు. వైల్డ్ కార్డులో ఎవరొచ్చినా నామినేట్ చేసేస్తారా..?వైల్డ్ కార్డులో రావడం పాపమా ? నామినేట్ చేయడమంటే డాన్స్ బాలేదనో, స్టెప్స్ సరిగా లేవనో చెప్పి నామినేట్ చేయాలి. ఐనా ఎవరో పంపిస్తే వెళ్ళిపోయి ఎవరో పంపిస్తే షోలోకి రావడం కాదు. కంటెస్టెంట్ కి బాగోకపోవడం వలన సెల్ఫ్ నామినేట్ చేసుకుని బయటకు వచ్చాడు తప్ప అక్కడ ఎవరు ఎవరినీ పంపించేంత సీన్ లేదక్కడ అన్నాడు అమర్.
ఐనా కంటెస్టెంట్స్ వలన మెంటార్స్ కి పేరు కానీ మెంటార్స్ వలన కంటెస్టెంట్స్ కి పేరు లేదు. మెంటార్స్ వాళ్ళను రిప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్లకు పేరు. కాబట్టి వాళ్ళను ఎవరూ తోసేయలేరు. కాబట్టి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్న మానస్ - సాగరికాకి ఓటు వేయండి అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో చేసి పోస్ట్ చేసాడు. అది డాన్స్ కాంపిటీషన్..అక్కడ డాన్స్ ని మాత్రమే చూడాలి..కాబట్టి వాళ్ళను ఎవరూ బయటకు తోసేయలేరు అని చెప్పాడు. ఐతే ఈ డాన్స్ ఐకాన్ లో ప్రకృతి మాట్లాడిన మాటల మీద నెటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఇది టెంపరరీ షో కానీ ఆమె మాత్రం చాలా పర్సనల్ గా మాట్లాడుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సాగరికా రావడం రావడమే ఓంకార్ ఇచ్చిన థీమ్ కి సరితూగే డాన్స్ చేసి అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అది డాన్స్ కాంపిటీషన్ అమ్మ.. ప్రాకృతికి ఇచ్చిపడేశాడు అమర్ దీప్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
