అమరదీప్-తేజస్విని ఫ్యూచర్ ఏఐ రూపంలో ఇలా...
on May 31, 2025
.webp)
అమరదీప్ - తేజస్విని గౌడ బుల్లి తెర మీద సీరియల్స్ ద్వారా షోస్, ఈవెంట్స్ ద్వారా ఆడియన్స్ పరిచయమే. అలాంటి తేజు రీసెంట్ గా కాకమ్మ కథలు షోకి గెస్ట్ గా వచ్చింది. అందులో ఆమె ఎన్నో విషయాలను చెప్పింది. "నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాక అనుకోకుండా నేను ఇండస్ట్రీకి వచ్చాను. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు అయ్యింది. నిజంగా నేను చాలా లక్కీ నా గ్రాఫ్ ఇండస్ట్రీలో అలానే వెళ్తోంది. కోయిలమ్మ సీరియల్ టైములో నేను అమర్ ని కలిసాను. అప్పుడు అమర్ నాతో మాట్లాడాడు..నన్ను చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత కాల్ చేయడం, చాట్ చేయడం చేసేవాడు. మే బి ట్రై చేసాడేమో అప్పుడే...నేను అప్పుడే అనుకున్నాను కానీ పడలేదు నువ్వు అంటుంటాడు.
ఆ తర్వాత ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. ఈవెంట్స్, షోస్ లో కలిసినప్పుడు ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మ్యారేజ్ చేసుకుందాం అంటూ ప్రొపోజ్ చేసేసాడు. అప్పటివరకు నా మైండ్ లో అలాంటి థాట్స్ లేవు. కానీ పెళ్లి అని సడెన్ గా చెప్పేసరికి నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నాన్న లేకపోవడంతో చాలా స్ట్రాంగ్ గా ఉండేదాన్ని. దాంతో నేను ఎప్పుడూ అలాగే ఉండేదాన్ని. కానీ మా అమ్మ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది. కానీ బయట ఫాదర్స్ ని చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది. అమ్మ ఇండిపెండెంట్ విమెన్ కాబట్టి ఆమె నన్ను కూడా అలానే పెంచారు. ఈ రెండేళ్ల నుంచి నేను కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కొన్నాను. అలాంటి టైమ్స్ లో డాడీ ఉండుంటే ఆ పరిస్థితి వేరేలా ఉండేది కదా అనుకున్నా.." అంటూ చెప్పింది. ఇక హోస్ట్ తేజు ఐతే అమరదీప్-తేజస్విని ఫ్యూచర్ ఎలా ఉందో ఏఐ యూజ్ చేసి ఒక పిక్ ని చూపించింది. అందులో అమర్ - తేజు వాళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా అది రాబోయే ఫ్యూచర్ ఫామిలీ అని చూపించింది హోస్ట్ తేజస్విని మడివాడ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



