హాస్పిటల్ బెడ్ మీద సుప్రీత.. అది నిజమే!
on May 18, 2025
బుల్లితెర మీద హల్చల్ చేస్తున్న సుప్రీతా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె ఎవరో కాదు నటి సురేఖావాణి కూతురు. రీసెంట్ గా సుప్రీతా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోలో యాదమ్మ రాజుకి జోడిగా వచ్చి వంటలు చేసింది. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మరో మూడు మూవీస్ లో కనిపించబోతోంది. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఐతే చెప్పక్కర్లేదు. హాట్ పిక్స్ తో కుర్రాళ్ళ మనసులు దోచుకుంటూ ఉంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అప్ డేట్స్ పెడుతూనే ఉంటుంది. ఎవరు ఎలా ట్రోల్ చేసినా సుప్రీతా పెద్దగా పట్టించుకోదు. తల్లి సురేఖతో కలిసి ట్రిప్స్ వెళ్తూ ఆ పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి రీసెంట్ గా మామిడికాయ పచ్చడి కూడా పెట్టి ఆ వీడియోని కూడా పోస్ట్ చేసింది.
అలాంటి సుప్రీతా ఇప్పుడు సడెన్ గా హాస్పిటల్ లో బెడ్ మీద కనిపించింది. చేతికి సెలైన్ ఎక్కించుకుంటూ ఉంది. హాస్పిటల్ పిక్స్ చూసిన నెటిజన్స్ ఏమయ్యింది అంటున్నారు ..టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు, స్పీడీ రికవరీ అంటూ చెప్తున్నారు. ఇక సన కూడా కామెంట్ పెట్టింది. గెట్ వెల్ సూన్, లాట్స్ ఆఫ్ లవ్.. అని చెప్పింది.
తన పిక్స్ తో పాటు ఒక కామెంట్ కూడా పోస్ట్ చేసింది. "ద్రుష్టి నిజమే. ఈ వారం నేను నా జీవితంలో ఎలా బలంగా ఉండాలో ఆలోచిస్తూ ఉన్నాను. నేను శివయ్యను నమ్ముతాను.. కానీ ఆయనకు నా మీద బాగా కోపం వచ్చినట్టుగా ఉంది. ఐనా నా జీవితంలో శివయ్య, మా అమ్మ, ప్రసన్న, రమణ. నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి.. వీళ్ళు లేకుండా నేను లేను. ఈ భూమి మీద ఉన్న నాకు ఈ జీవితం ఎన్నో పరీక్షలు పెడుతూనే ఉంది. ఈ ద్రుష్టి కారణంగా నా మానసిక, శారీరక ఆరోగ్యం బాగా ఎఫెక్ట్ అయ్యింది. శారీరక ఆరోగ్యం బాగుండాలి అంటే ముందుగా మానసిక ఆరోగ్యం చాలా బాగుండాలి." అంటూ రాసుకొచ్చింది.
అమరదీప్ తో సుప్రీతా ఒక లవ్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తోంది. రీసెంట్ గానే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద సారీ చెప్తూ ఒక వీడియో కూడా చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
