ప్రతీ తల్లీ ఒక భరతమాతే..వాళ్ళ కోసం ఈ పాట అంకితం
on May 14, 2025

బిగ్ బాస్ సీజన్ 1 ద్వారా నటి హరితేజలోని టాలెంట్ అంతా బయటకు వచ్చింది. ఈ మొదటి సీజన్ లో ఆమె చాలా హైలైట్ అయ్యింది. టాస్కులు ఆడింది. బుర్ర కథలు, హరికథలు చెప్పింది. ఐతే ఈ మధ్య హరితేజ బుల్లితెర మీద ఎక్కువగా కనిపించడం లేదు. ఆమె యాంకర్ గా, సీరియల్ నటిగా చేసింది. రక్త సంబంధం, కన్యాదానం, మనసు - మమతా, అభిషేకం వంటి సీరియల్స్ లో ఆమె నటించింది. ఇక మూవీస్ విషయానికి వస్తే అఆలో సమంతతో కలిసి నటించింది. అలాగే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అత్తారింటికి దారేది, విన్నర్, దువ్వాడ జగన్నాధం, నేనే రాజు నేనే మంత్రి వంటి ఎన్నో మూవీస్ లో కూడా నటించింది.
అలాంటి హరితేజ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. ఒక ఎత్తైన కొండ మీద వాన పడుతూ ఉండగా అక్కడ భరతనాట్యం చేస్తూ కనిపించింది. పరదేశి మూవీ నుంచి "జగతి సిగలో జాబిలమ్మకు" అనే సాంగ్ కి నృత్యం చేసింది. "భరతమాత సంరక్షణ కోసం తన పిల్లలను సరిహద్దుల్లో నిలిపిన ప్రతీ తల్లీ ఒక భారతమాతే.. ఆ తల్లులకు ఈ పాట అంకితం. మేమంతా మీకు సెల్యూట్ చేస్తున్నాం, మీ వైపు నిలబడి ఉన్నాం..జైహింద్ " అంటూ ఒక టాగ్ కూడా పెట్టింది. నెటిజన్స్ ఐతే హరితేజను తెగ పొగిడేస్తున్నారు. "హరితేజ మల్టిటాలెంటెడ్... రియల్ ట్రిబ్యూట్, మీరు ఎక్కడ డాన్స్ చేసి స్లిప్ అవుతారో అని భయపడ్డాను... సూపర్బ్... నెమలిలా నాట్యం చేశారు..ఈ ప్లేస్ ఎక్కడ. సెల్యూట్" అంటూ మెసేజెస్ పెట్టారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



