Home

»

Tv News

రాజు, ఇందుల శోభనం ఆపాలని రేఖ కుట్ర..భ్రమరాంబ రివర్స్ ప్లాన్!

May 31, 2026 8:35AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1046 లో..... చలపతి ఇంటికి శంకర్ వస్తాడు. తను ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని శంకర్ అడుగుతాడు. ఇప్పటికిప్పుడు అంటే ఎలా.. ప్రతీ నెల వడ్డీ ఇస్తున్నాం కదా అని చలపతి అంటాడు. ఇన్నిరోజులు అంటే నీ కొడుకుకి జాబ్ ఉంది.. మరి ఇప్పుడు ఎలా ఇస్తావ్.. అందుకే అడుగుతున్నానని శంకర్ అంటాడు. దాంతో చలపతి ఇంట్లోకి వెళ్లి మూడు లక్షలు తీసుకొని వచ్చి ఇస్తాడు. మిగతా రెండు లక్షలు కొంచెం సమయం పడుతుందని చలపతి చెప్తాడు. ఈ రోజు సాయంత్రం వరకు కావాలని శంకర్ అడుగుతాడు. కొద్ది రోజులు టైమ్ కావాలని చలపతి రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో సరే నాకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తే అసలు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

 

ఆ తర్వాత ఇదంతా నా వల్లే అని వెంకీ ఫీల్ అవుతాడు. నువ్వు దాని గురించి ఏం ఆలోచించకని వెంకీతో చలపతి చెప్తాడు. మరొకవైపు అపర్ణ పంతులు గారిని పిలిపించి ఇందు, రాజుల శోభనానికి ముహూర్తం పెట్టమని చెప్తుంది. అప్పడే అక్కడికి రేఖ వచ్చి..  అసలు ఏం జరుగుతుందని అడుగుతుంది. ఇందు, రాజుల శోభనానికి ముహూర్తం పెట్టించానని అపర్ణ అనగానే ఇప్పుడు అవసరమా అని రేఖ కోప్పడుతుంది. అసలు ఏంటి నువ్వు మొన్న కూడా వాళ్ళిద్దరిని ఒక గదిలో పడుకోనివ్వలేదు.. ఇప్పుడు శోభనం వద్దని అంటున్నావని సుభాష్ కోప్పడతాడు. అపర్ణపై రేఖ కోప్పడుతుంది. ఇన్నిరోజులు అంటే నువ్వు వాళ్ళని ఏం అన్నా చెల్లింది.. ఇక మీదట వాళ్ళని ఏం అనడానికి వీల్లేదు.. అమ్మమ్మ మీకు తోడుగా నేను ఉన్నానని అపర్ణతో రాజు అంటాడు. దాంతో రేఖ ఏం మాట్లాడలేకపోతుంది.ఇందు నువ్వు వెళ్లి రెడీ అవ్వు అని అపర్ణ అంటుంది. స్వాతి, ఐశ్వర్య మీరు పూజకి ఏర్పాట్లు చెయ్యండి అని అపర్ణ పంపిస్తుంది. రాజు నువ్వు కూడా రెడీ అవ్వు అని అతన్ని కూడా పంపిస్తుంది అపర్ణ. ఆ తర్వాత ఈ శోభనం ఎలా ఆపాలో నాకు తెలుసని రేఖ అనుకుంటుంది. రేఖ ఏం ప్లాన్ చేసినా నాకు చెప్తుంది.. కానీ ఆ ప్లాన్ సక్సెస్ కాకుండా నేను చేస్తానని  శేషుతో భ్రమరాంబ అంటుంది.

 

మరొకవైపు చలపతి,లక్ష్మి, వెంకీ భోజనం చెయ్యడానికి సిద్ధమవుతారు. వెంకీ భోజనం చేయబోతూ శంకర్ అన్న మాటలు గుర్తుచేసుకొని భోజనం చేయకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వెంకీకి నందు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తాడు. వీడు జాబ్ రాలేదన్న బాధలో ఉండి ఉంటాడని నందు అనుకుంటుంది. తరువాయి భాగంలో శోభనం జరగకుండా రేఖ, భూషణ్ ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా రాజు నిద్రపోయేలా పాలల్లో ట్యాబ్లెట్ కలిపి ఇవ్వమని భ్రమరాంబకి చెప్తారు. కానీ భ్రమరాంబ అలా కాకుండా శోభనం జరగాలని వేరే ట్యాబ్లెట్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Brahmamudi Serial Latest Update, Brahmamudi Today Episode Telugu, Star Maa Serials, Brahmamudi Raj Indu Shobhanam, Telugu Serial Gossips

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com