Home

»

Tv News

కళ్యాణ్ మూవీకి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోనన్న ఆట సందీప్

Aug 13, 2026 4:49PM

బిగ్ బాస్ 9 నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ అంతా కూడా  కష్టపడుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. రీసెంట్ గా డెమోన్ పవన్ కూడా రీతుతో కలిసి బంగారం అనే కవర్ సాంగ్ చేసి ఆడియన్స్ లో కానీ ఇండస్ట్రీలో కానీ తనకంటూ ఒకమంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు కళ్యాణ్ పడాల వంతు వచ్చింది. "నిజమే రుజువైనది " అనే సాంగ్ ప్రీమియర్స్ వేశారు. దానికి బిగ్ బాస్ నుంచి చాలామంది అటెండ్ అయ్యారు. ఇక ఆకాష్ పూరి కూడా కళ్యాణ్ గురించి చాలా చక్కగా చెప్పారు.

"కళ్యాణ్ ఫేస్ లో చాలా ఇన్నోసెన్స్  ఉంది. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్నాడు. ఒక అన్నగా తమ్ముడిలా అనిపిస్తాడు. మంచి మంచి మూవీస్ రావాలి అని కోరుకుంటున్నా " అని విష్ చేశారు. ఇక తర్వాత కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడారు. "కళ్యాణ్ ని చూసే సొంత బ్రదర్ లా అనిపిస్తది. బిగ్ బాస్ లో కళ్యాణ్ ఉన్నప్పుడు తనకు చాలా సపోర్ట్ చేశా. టీవిలో సపోర్ట్ చేయడం కాదు. నాకు చాలా హార్ట్ ఫుల్ గా అనిపించింది. కళ్యాణ్ కి సక్సెస్ వస్తే నాకు వచ్చినట్టే అనిపించింది. కళ్యాణ్ 70 ఎంఎం స్క్రీన్ మీద ఒక పెద్ద సినిమా చేయాలనీ కోరుకుంటున్న. ఆయన పెర్ఫార్మెన్స్  కూడా చాలా బాగుంటుంది. కళ్యాణ్ మూవీ చేస్తే గనక ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను నీకు సపోర్ట్ చేస్తాను . ఇది నా ప్రామిస్ " అని చెప్పాడు.

ఇక రీతూ కూడా మాట్లాడింది. "చాలా చాలా బాగా చేసాడు ఈ సాంగ్. చాలా బాగున్నావ్. నేను నవ్వుతానేమో అనుకున్న. ఫ్రెండ్ ని స్క్రీన్ మీద చూసినప్పుడు మొదట నవ్వొస్తుంది. నిజంగా నాకు కళ్యాణ్ లో ఒక యాక్టర్ కనిపించాడు. ఫ్రెండ్  కనపడలేదు. నేను కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాను. తొందరలోనే ఒక సూపర్ డూపర్ హిట్ మూవీ రావాలని కోరుకుంటున్నా. అలాగే మానిఫెస్ట్ చేస్తున్నా  " అని చెప్పింది.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com