Home

»

Tv News

బిగ్ బాస్ కి గెస్ట్ రోల్ లో ఆది... డైరెక్టర్ గా కష్టం...రైటర్ , ఆర్టిస్టుగానే కంటిన్యూ అవుతా

Aug 13, 2026 4:45PM

బిగ్ బాస్ అనగానే కొన్ని రోజులు అయ్యాక కంటెస్టెంట్స్ లో ఎనర్జీ తేవడానికి వాళ్లకు ఇన్స్పిరేషన్ కలిగించే మాటలు చెప్పడానికి ఎవరో ఒక సెలెబ్రిటీని తీసుకొస్తూ ఉంటారు బిగ్ బాస్ మేకర్స్ . అలా జబర్దస్త్ నుంచి హైపర్ ఆది సెగ్మెంట్ అనేది  ప్రతీ  బిగ్ బాస్ లో కచ్చితంగా ఉంటుంది. వారం మొత్తం టాస్కులు ఆడి ఎంటర్టైన్  చేసే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో మళ్ళీ ఊపు తేవడానికి హైపర్ ఆది అలా వెళ్లి వాళ్లకు మోటివేషన్ ఇచ్చి వస్తుంటాడు.

ఐతే రీసెంట్ గా ఇదే విషయాన్ని ఒక చిట్ చాట్ లో ఆది షేర్ చేసుకున్నాడు. "ప్రతీ బిగ్ బాస్ కి మీరు వెళ్తారు కదా ఈ బిగ్ బాస్ ఎలా ఉండబోతోందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. " అని అడిగిన ప్రశ్నకు "బిగ్ బాస్ కి నేను వెళ్లే ఆ పర్టికులర్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. నేను కూడా ఆ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోపల అంతమంది అన్ని రోజులు  ఉండడం చాల కష్టమైన విషయం. వాళ్లందరికీ చిన్న ఎంటర్టైన్మెంట్ లా నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్తుంటాను. ఐతే అది ఎప్పుడో మరి తెలీదు " అని చెప్పాడు.

"జబర్దస్త్ వాళ్లంతా డైరెక్టర్స్ అవుతూ ఉన్నారు కదా. అభి , వేణు ఇలా మీరెప్పుడు " అన్న ప్రశ్నకు. "నేను ఇలా రైటింగ్ చేసుకుంటూ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతాను. డైరెక్టర్ అనేది కష్టం చూద్దాం. " అని చెప్పాడు. ఐతే ఆది బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా కాకుండా ఎంటర్టైన్ చేయడానికి వెళ్లి వస్తుంటాడు. ఐతే గతంలో బిగ్ బాస్ సీజన్ 5 లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వెళ్లి అందరినీ ఉత్సాహపరిచారు. సీజన్ 6 లో  దీపావళి స్పెషల్  ఎపిసోడ్‌లో ఒక గెస్ట్ రోల్ లో వెళ్లి ఎంటర్టైన్ చేసాడు. సీజన్ 7 లో కంటెస్టెంట్స్  ఆటతీరును  అంచనా వేసే ఒక స్పెషల్ కామెడీ ఫీడ్ బ్యాక్ ఇవ్వడానికి గెస్ట్ గా వెళ్ళాడు.  సీజన్ 9 లో దీపావళి స్పెషల్ వీకెండ్ లో , 'పాపా రాయుడు' గెటప్ లో స్టేజి మీద హౌస్ మేట్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు.  ఇలా ప్రతీ సీజన్ లో ఆది గెస్ట్ గా ఏదో  ఒక గెటప్ తో వెళ్తుంటాడు. మరి ఈ సీజన్ లో ఎప్పుడు వెళ్తాడో చూడాలి.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com