
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆడియన్స్ ముందుకు రావడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ కంటెస్టెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఎంతమంది ఉండబోతున్నారు. హౌస్ లోకి ఎవరు వెళ్తారు అనే విషయాలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక రీసెంట్ ఒక 15 మంది లిస్ట్ వచ్చింది. అందులోంచి ఇద్దరితో ఉన్న ప్రోమో రీసెంట్ గా రిలీజయ్యింది.
మొదటిగా ఈ ప్రోమోలో మదనపల్లె నుంచి మిథిలేష్ రెడ్డి అలియాస్ కండల వీరుడు ఎంట్రీ ఇచ్చాడు మంచి స్మైల్ తో. తర్వాత అద్దిరిపోయే కాస్ట్యూమ్ క్యూట్ గా సెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది కరీంనగర్ నుంచి షాలిని దామెర. ఇక జడ్జెస్ ఇద్దరినీ తమ ప్రశ్నలతో రోస్ట్ చేశారు. ముందుగా నవదీప్ కండల కుర్రాడిని అడిగాడు "ఏంటి నీ పర్సనాలిటీ...ఒక మనిషిగా ఏంటి నువ్వు" అన్నాడు. "నేను చాలా బోల్డ్" అని చెప్తాను అన్నాడు ఆ కుర్రాడు. వెంటనే నవదీప్ బోల్డా అని అనేసరికి "బోల్డ్ అంటే నాకు భయం లేదు అని నేను ఏది చేయడానికైనా రెడీ గా ఉన్నానని అర్ధం " అని విడమరిచి చెప్పాడు. దాంతో వెంటనే నవదీప్ సెట్ లోంచి లేచి నువ్వు నీ పుషప్స్ తీస్తూ ఉండు. నేను నీ వీపు మీద వెయిట్ పెడుతూ ఉంటాను అన్నాడు. అలా 40 కేజీల వెయిట్ పెట్టాడు. ఆ కుర్రాడు కూడా ఎలాగో పుషప్స్ తీసాడు.
ఇక తర్వాత షాలిని దామెర వచ్చింది. ఫిజికల్ టాస్క్ అంటారా రీసెంట్ గా జిమ్ కూడా స్టార్ట్ చేసాను. 8 నెలల నుంచి . కొంచెం కండ కూడా వచ్చింది అని చెప్పింది. దాంతో శ్రీముఖి "చూపించు కండ అంది ". షాలిని కూడా చిన్న కండను చూపించింది. "హే టచ్ చేసి చూడు స్కూల్ బెంచ్ లా లేదు " అంటూ మరో వైపు నుంచి నవదీప్ కామెడీ సెటైర్. ఇక బిందు మాధవి ఎం చెప్పిందంటే "నువ్వు షూస్ క్లీన్ చెయ్యి " అని చెప్పింది. "నేను అది చేయను " అని చెప్పింది షాలిని.
వెంటనే శ్రీముఖి సీరియస్ గా అరిచింది. వెంటనే అభిజిత్ "ఏ పనైనా చిన్న పనైనా పెద్ద పనని కాదు " అని చెప్పాడు. వెంటనే షాలిని షూస్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది. వెంటనే వాటిని పక్కనే ఉన్న బకెట్ నీళ్ళల్లో ముంచేసింది. వెంటనే అది చూసిన బిందు మాధవి షాకయ్యింది. "షూస్ ఎప్పుడూ నీళ్ళల్లో ముంచరమ్మా. ఇది నువ్వు చాలా జోక్ గా తీసుకుంటున్నావ్ ... " అని చెప్పి రెడ్ ఫ్లేమ్ ఇచ్చింది.
వెంటనే అభిజిత్ లేచి స్టేజి మీదకు తన కర్చీఫ్ తీసుకుని వెళ్లి "ఏమీ అనుకోకుండా మీ గౌన్ కొంచెం పైకి తియ్యి " అన్నాడు. షాలిని కాళ్ళ దగ్గర ఉన్న తన గౌన్ ని కొంచెం పైకి లేపింది. వెంటనే అభిజిత్ మోకాలి మీద వంగి "ఏ పనైనా తక్కువది కాదు" అంటూ కర్చీఫ్ తో ఆమె చెప్పుల్ని క్లీన్ చేసాడు. దాంతో ఆమె బాగా ఏడ్చేసింది. ఎం కాదు అంటూ అభిజిత్ భుజం తట్టాడు.






