బిబి 9 ప్రెస్ మీట్ లో హౌస్ మేట్స్ మధ్య గొడవ.. ఆ విషయాన్ని రివీల్ చేయనన్న భరణి!
on Dec 31, 2025

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ ఆదివారం కొత్త థీమ్ తో రాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అదే బిబి 9 ప్రెస్ మీట్. "భరణి గారు ఎవరినైనా ఒక్కళ్లను చూసి ఏం నటిస్తున్నావురా అని అనిపించిన ఏదన్నా కంటెస్టెంట్ ఉన్నారా" అంటూ శ్రీముఖి భరణిని అడిగింది. "100 % అక్కడ అందరూ నటిస్తూనే ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అంతా ఎక్కడో ఒక చోట నటించాల్సి వస్తుంది." అని చెప్పాడు భరణి. "అంటే అందులో మీరు కూడా ఉన్నారు. అంటే మీరు కూడా నటించారా" అంటూ అవినాష్ రివర్స్ లో క్వశ్చన్ చేసాడు. ఐతే భరణి ఫుల్ ఫైర్ అవుతూ "సుమన్ అన్న దగ్గర నేను ఎక్కడ నటించాల్సి రాలేదు" అని చెప్పాడు. "ఎవరి దగ్గర నటించాల్సి వచ్చింది" అని శ్రీముఖి మళ్ళీ అడిగింది. "అదా.. ఆ విషయాన్నీ నేను రివీల్ చేయను" అన్నాడు. "అంటే మీరు భయపడుతున్నారా" అని అడిగింది శ్రీముఖి. ఎవరికీ అని అడిగాడు భరణి.
ఇక తర్వాత రీతూ చౌదరిని "ఇమ్మానుయేల్ మీకు మంచి ఫ్రెండ్ కదా.. సడన్ గా ఇమ్మానుయేల్ ని వదిలేసి వెళ్లిపోయారు" అంటూ అవినాష్, శ్రీముఖి అడిగారు. "ఇమ్మానుయేల్ ని నేను వదిలేయలేదు. అతనే నన్ను వదిలేసి కళ్యాణ్ దగ్గరకు వెళ్ళిపోయాడు" అంటూ రీతూ చౌదరి తన వెర్షన్ చెప్పింది. " అంటే మీరు వదిలేసి డెమోన్ దగ్గరకు వెళ్లలేదా. అంటే మీరు ఇమ్మానుయేల్ కప్పు గెలవకూడదు అనుకున్నారా " అని అవినాష్ మళ్ళీ ఘాటైన ప్రశ్న అడిగాడు. "నాకు హౌస్ లో ఎవరైతే బ్యాక్ బోన్ లా ఉన్నారో.. ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో.. ఎవరైతే నాతో ఎమోషనల్ గా ఉన్నారో వాళ్లే గెలవాలని కోరుకున్నా" అంటూ రీతూ కూడా గట్టిగా ఆన్సర్ ఇచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



