గతం గుర్తుందా తేజు...మగాళ్ళన్నాక ఆడవాళ్ళనే కదరా చూసేది
on May 17, 2025
ఆదివారం విత్ స్టార్ మా పరివారం లీగ్ తో ఈ షో ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. ఈ ఎపిసోడ్ కి నిఖిల్, అలీ రెజా, రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత, తేజస్విని గౌడ, శోభా శెట్టి, ఐశ్వర్య పిస్సే, దీపికా రంగరాజు ఇంకా కొంతమంది బుల్లితెర స్టార్స్ వచ్చారు. ఇక నిఖిల్ ఈ షోకి నల్ల కళ్ళజోడు పెట్టుకుని వచ్చాడు. అది చూసి హరి చాలా ఫీలయ్యాడు. "ఈయన్ని కళ్ళజోడు తియ్యమని చెప్పండి. కేవలం అమ్మాయిలనే చూస్తున్నాడు" అన్నాడు. "మగాళ్ళన్నాక ఆడవాళ్ళనే కదరా చూసేది " అని శ్రీముఖి ఆన్సర్ ఇవ్వడంతో అందరూ నవ్వేశారు. తర్వాత నిఖిల్ వెళ్లి తేజుతో డాన్స్ చేయడాన్ని తట్టుకోలేకపోయాడు హరి. "పాయింట్ పోయింది కాక సిగ్గులేకుండా డాన్స్ వేస్తున్నాడు నిఖిల్" అనేశాడు. "ఆయన జీవితంలోంచి ఒకావిడా వెళ్ళిపోయాక మీరే ఎక్కువగా ఆయన మీద కన్నేసినట్టు ఉన్నారు" అంటూ హరి మీద కౌంటర్ డైలాగ్ వేసింది శ్రీముఖి.
"అరే ఎం కావాలో చెప్పు నీకు" అని నిఖిల్ అడిగేసరికి "నువ్వే కావాలి" అన్నాడు అవినాష్. "ఒక్క పాయింట్ రాలేదు కానీ చూడు కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు" అన్నాడు హరి. "నిఖిల్ అండ్ అలీ మీరు కాలేసుకోవడం ఆయనకు నచ్చట్లేదు ఆయన మీద కాలేయాలని ఆయన కోరుకుంటున్నారు" అని శ్రీముఖి చెప్పేసరికి ఒక్కసారిగా హరి షాకయ్యాడు. తర్వాత వీళ్ళతో గేమ్స్ ఆడించింది శ్రీముఖి. ఇందులో తేజుకు బాల్ వచ్చి గట్టిగా తగిలేసరికి గతం మర్చిపోయిందేమో అంటూ శ్రీముఖి పలకరించింది. "నీకు పెళ్లి ఎవరితో అయ్యింది" అని అడిగేసరికి అమరదీప్ తో అని చెప్పింది తేజు. ఇలా ఈ ఆదివారం ఈ ఎపిసోడ్ అందరినీ అలరించబోతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
