
పెళ్లి కానీ వాళ్ళ మీద, పెళ్లి చేసుకొని వాళ్ళ మీద పెద్దవాళ్ళు ఒక కౌంటర్ వేస్తూ ఉంటారు. "బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికిరారు " అని . ఐతే ఇప్పుడు అలా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ పేరుతో కొంతమంది అలాగే ఉండిపోయారు. వాళ్ళల్లో నవదీప్, హోస్ట్ ప్రదీప్, యాంకర్ సుధీర్. ఐతే నవదీప్ ని ఎవరు ఎక్కడ కనిపించినా పెళ్లి గురించే టాపిక్ వస్తుంది. ఐతే నవదీప్ పెళ్లి ఎప్పుడు అని అడిగితే సరైన ఆన్సర్ ఐతే ఇవ్వడు. నెటిజన్స్ అడిగినా అంతే.
నవదీప్ మాత్రం సింగల్ గా దేశాలు అన్నీ వెళ్తూ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ జిమ్ లో బాడీ బిల్డ్ చేస్తూ మరో పక్క టీవీ షోస్ లో జడ్జ్ గా చేస్తూ అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద నటిస్తూ అస్సలు ఖాళీ లేకుండా ఉంటున్నాడు. కానీ పెళ్లి అంటే మాత్రం నో ఆన్సర్ . దీని మీద రీసెంట్ గా ఆయన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టిన ఒక రీల్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. నవదీప్ సీరియస్ గా ఒక మూల కూర్చుని ఉంటాడు. వెనక నుంచి ఆయన కొలీగ్ ఒక చెప్పు తెచ్చి "ఇదేందిరా " అని అడుగుతుంది. "చెప్పు " అంటాడు. ఇంకో చెప్పు చూపించి "మరి ఇదేందీ " అని అడుగుతుంది. "దాని జోడి చెప్పు ఆ" అంటాడు నవదీప్.
"చెప్పుకు కూడా జోడి ఉందిరా నీకేదిరా జోడి " అని అడుగుతుంది. ఆ మాటకు నవదీప్ తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ రీల్ ని నెటిజన్స్ తెగ రిప్లైస్ ఇచ్చారు. "మాస్ జాతరలో మా లాంటి జోడీలను చూసి చూసి ఇంకా జోడి అవ్వద్దు అనుకున్నావేమో కదా అన్నా .... సూర్యుడు కూడా ఒక్కడే కానీ ఎంత వెలుగిస్తున్నాడు. సిస్టర్... జోడి కట్టుకొన్నోళ్ళే ఇప్పుడు చెప్పుతో చెప్పుకొని చెప్పిచ్చుకొని కొట్టుకొంటున్నాం...బ్రో నువ్వు అదృష్టవంతుడివి... చెప్పులకు జోడీ కావాలి మగాళ్లకు అవసరం లేదు. తెలివిగలవాళ్ళు సింగల్ గానే ఉంటారు. నువ్వు కొరియా వెళ్ళిపో శివాజీ...జోడి కోసం పోయి డ్రమ్ములోకి పోలేం లే అక్క…. మమ్మల్ని ఇలా వదిలేయ్" అంటూ రకరకాల కామెడీ కామెంట్స్ ని పోస్ట్ చేశారు.





.webp)
