Home

»

Tv News

పామును రక్షించిన హీరోయిన్ సదా... త్రిపురా ఎన్నో అనుభూతులను ఇచ్చింది

Aug 5, 2026 6:15PM

సిల్వర్ స్క్రీన్ మీద ఇలా  జయం మూవీతో ఇలా మెరిసి అలా కొన్ని మూవీస్ చేసి మాయమైపోయింది సదా అంటే పరిచయం అక్కరలేదు. ఎందుకంటే సదా మూవీస్ లో చేయకపోయినా సోషల్ మీడియాలో నిత్యం నెటిజన్స్ తో టచ్ లో ఉంటుంది. తనకు ఎంతో ఇష్టమైన ప్రకృతితో , మూగజీవాలతో మమేకమవుతూ ఆ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి సదా రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ అది మాములు పోస్ట్ కాదు. ఒక పామును రక్షించిన వీడియో. ఆ తర్వాత దాని గురించి ఒక సుదీర్ఘ నోట్ కూడా రాసుకొచ్చింది.

అందులో ఏముందంటే ... " కొన్ని ప్రయాణాలు మనకు ఎప్పటికీ  మర్చిపోని జ్ఞాపకాలను  అందమైన ఫొటోలను మిగులుస్తాయి. మరికొన్ని  జీవితాన్ని చూసే కోణాన్ని  పూర్తిగా మార్చేస్తాయి. త్రిపుర నాకు ఈ రెండింటినీ ఇచ్చింది. అంతగా పరిచయం లేని అందంగా ఉండే త్రిపురా వెళ్లాను. ఇక్కడ ఎన్నో మర్చిపోలేని అనుభవాలు ఎదురయ్యాయి.   వాటిల్లో  స్ఫూర్తినిచ్చిన అంశం  పాముల రక్షణ కోసం  నిరంతరం పనిచేస్తున్న యానిమల్ ఎయిడ్ అలయన్స్ వెల్ఫేర్ సొసైటీ సేవలను ప్రత్యక్షంగా చూసాను.  ఈ సంస్థ పెద్ద సంఖ్యలో పాములను రక్షిస్తూ,  సురక్షితంగా అడవుల్లోకి తిరిగి వదిలేస్తోంది. వారు నిర్వహిస్తున్న రెస్క్యూల సంఖ్య  ఆశ్చర్యం కలిగింది. నా పక్కన  ఉన్న వ్యక్తి డాక్టర్ గౌతమ్ మల్లిక్.  దంత వైద్యుడు. తన డ్యూటీ పూర్తయ్యాక స్వచ్ఛందంగా పాములను రక్షించే పని చేస్తుంటారు.  ఆయనతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధకులు, వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది ఈ సేవలో భాగమయ్యారు. వీరందరినీ కలిపే లక్ష్యం ఒక్కటే..  పాములకు  బతికే అవకాశం కల్పించడం. ఈ సంస్థపై స్థానిక ప్రజలు పెంచుకున్న నమ్మకం నన్ను ఆకట్టుకుంది. పాము కనిపించగానే భయంతో దాన్ని చంపడమే  హాని చేయడం కాకుండా..  ఈ  సంస్థకు ఫోన్ చేసి సాయం కోరుతున్నారు. ఒక్క జూన్  లోనే 295 పాములను రక్షించారు. అవగాహన అంటే ఇదే.  ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చడంతో పాటు ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు. నేను కూడా వారితో కలిసి కొన్ని  పాములను రక్షించే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసాను . వారు పాములను రక్షించే సమయంలో కఠినమైన నిబంధనలు పాటిస్తారు. అటవీ శాఖ  సమన్వయంతో పనిచేస్తారు. రక్షించిన ప్రతి పాము వివరాలను నమోదు చేసి , వాటిని అడవిలో ఎక్కడ, ఎప్పుడు వదిలారనే విషయాన్ని  రికార్డు చేస్తారు. రక్షించిన పాముల్లో ఒకదాన్ని తిరిగి అడవిలోకి వదిలే అవకాశం నాకు లభించింది. అది విషపూరితం కాని అందమైన ఇండో-చైనీస్ ర్యాట్ స్నేక్. ఆ పామును అడవిలో వదిలాకా  అది మెల్లగా అక్కడి చెట్ల మధ్య వెళ్లిపోతున్నా  దృశ్యం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. అది కేవలం ఒక పామును అడవిలోకి వదిలేయడం మాత్రమే కాదు. ప్రతి జీవి  సహజ వాతావరణంలోకి తిరిగి వెళ్లే అవకాశం ఉండాలని గుర్తుచేసిన క్షణం. మేము ఈ ప్రకృతి అందాలతో నిండిన రాష్ట్రానికి మాక్రో ఫొటోగ్రఫీ కోసం వెళ్లాం. అయితే అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నా వెంట  అందమైన ఫొటోలు మాత్రమే తెచ్చుకోలేదు . భయంతో దూరపోయే  జీవులను రక్షించడానికి తమ జీవితాలను  అంకితం చేస్తున్న వ్యక్తులపై అపారమైన గౌరవాన్ని కూడా వెంట తెచ్చుకున్నాను.  ఈ పర్యటనలో మాతో కలిసి ఉన్న  వారి గురించి ప్రస్తావించాలి. అవినాష్ ఫిల్మ్‌మేకర్. అర్ణబ్ పాములపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్త. ఇప్పటికే ఆయనకు పలు పరిశోధనా ప్రచురణలు ఉన్నాయి. ఈ ఎన్జిఓ  వ్యవస్థాపక సభ్యుల్లో అర్ణబ్ కూడా ఒకరు. కొన్ని ప్రయాణాలు మన కళ్లకు అందమైన దృశ్యాలను చూపిస్తాయి. మరికొన్ని ప్రయాణాలు మాత్రం ప్రపంచాన్ని చూసే మన దృష్టినే మార్చేస్తాయి. త్రిపుర నాకు అలాంటి ప్రయాణాన్నే అందించింది."
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com