Home

»

Tv News

టైటానిక్ బోట్ లో డ్రామా జూనియర్స్ హోస్ట్, జడ్జెస్ షికారు

Aug 5, 2026 6:04PM

డ్రామా జూనియర్స్ గురించి చెప్పాలంటే అందులో చిన్నపిల్లలా కామెడీ ఒక లెక్క పెద్ద జడ్జెస్ మరో లెక్క అన్నట్టుగా ఉంది. అందులోనూ అనిల్ రావిపూడి పిల్లల్లో పిల్లాడైపోయి కామెడీ చేయడం సుధీర్ ని రోస్ట్ చేసి పేస్ట్ చేసి నవ్వించడం చేస్తూ ఉంటారు. ఇక లేటెస్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఇందులో స్పెషల్ సుధీర్ బోట్  టూర్ అంటూ అందులో అనిల్ రావిపూడి, సుధీర్, శ్రీకాంత్, ధన్య బాలకృష్ణ ఎక్కారు. ఆ బోట్ పేరు టైటానిక్ అని పెట్టారు.

"ఐతే మీరు ఇప్పుడు జాక్ " అని అనిల్ ని అడిగాడు సుధీర్. "అవును " అన్నారు అనిల్. "ఐతే ఆవిడేంటి క్రాక" అంటూ ధన్య మీద కౌంటర్ వేసాడు. "మీరు " అంటూ శ్రీకాంత్ ని చూసి అనేసరికి "అది తెలియాలి అంటే దేవర కథ తెలియాలి " అంటూ బోట్ లోకి ఎక్కేసారు. "అసలు ఈ షిప్ క్వాలిటీ దేనా " అని అనిల్ అడిగారు. " ఈ బోట్ గురించి తెలియాలంటే నీకు దేవర కథ తెలియాలి " అంటూ శ్రీకాంత్ మళ్ళీ అదే డైలాగ్ చెప్పారు. "ఇది సముద్రం అనుకుంటున్నారా ఎర్ర సముద్రం అనుకుంటున్నారా మాట్లాడితే అదే డైలాగ్ " అన్నాడు సుధీర్. "ఇది ఎర్రగా ఉందిగా బోట్ " అంటూ శ్రీకాంత్ కౌంటర్ ఇచ్చారు. "బాబు బోట్ లో లైఫ్ జాకెట్ ఉందా " అని అనిల్ అడిగారు. "జాకెట్ లు లేవు కానీ ఫాల్స్ ఉన్నాయి" అన్న సుధీర్ డైలాగ్ కి అందరూ నవ్వేశారు.

ఇంతలో గుర్రాలు వెళ్లే సౌండ్ విని "ఏంట్రా గుర్రాల సౌండ్" అన్నారు అనిల్. "ఎదో నీళ్ళల్లో వెళ్తున్నాయి " అన్నాడు సుధీర్. "అదేంటి దుబుకు దుబుకు అని వస్తోంది సౌండ్ నీళ్లలో వెళ్తే పుచుకూ పుచుకూ అని రావాలి కదా " అన్నారు అనిల్. "ఆకలవుతుంది కాస్త సముద్రంలో చేపలు పట్టు " అంటూ అనిల్ సుధీర్ కి పని పురమాయించారు. ఇంతలో పిల్లి సౌండ్ వినేసరికి "సముద్రంలో పిల్లి ఎం చేస్తోంది " అని అడిగారు అనిల్.

"పిల్లి చేపల్ని తినేసింది " అన్నాడు సుధేర్. మళ్ళీ మేక అరుపు వినిపించింది. "ఇదేంటి మేక " అన్నారు. "మేక పిల్లిని తినేసింది " అన్నాడు సుధీర్. కోడి సౌండ్ వినిపించింది. "కోడి మేకను తినేసిందని మాత్రం చెప్పకు " అంటూ అనిల్ కౌంటర్ వేశారు. ఇలా వరస పంచులు, కౌంటర్లు, సెటైర్స్ తో అనిల్ రావిపూడి, సుధీర్ మధ్య మంచి కామెడీ జరిగింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com