రాగసుధకు ఎదురుపడిన ఆర్య వర్థన్ ఏం జరగనుంది?
on Feb 18, 2022

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. శ్రీరామ్ వెంకట్, వర్ష కీలక పాత్రల్లో నటించారు. బెంగళూరు పద్మ, జ్యోతిరెడ్డి, విశ్వమోహన్, రామ్ జగన్, జయలలిత. అనుషా సంతోష్ కీలక పాత్రలు పోషించారు. గత కొన్ని వారాలుగా ఆసక్తికర మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ ఉత్కఠభరిత సన్నివేశాలతో మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ శనివారం ఏం జరగనుందో ఒక సారి చూద్దాం. రాగసుధ, అను కలిసి రెస్టారెంట్ కి వెళతారు. ఆర్య వర్థన్ తన ఆఫీస్ స్టాఫ్ మీటింగ్ కారణంగా టీమ్ తో కలిసి ఇదే రెస్టారెంట్ కి వస్తాడు.
కట్ చేస్తే మాన్సీ మాత్రం మందుకు అలవాటు పడిపోతుంది. ఏకంగా ఇంట్లోనే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం మొదలుపెడుతుంది. ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ తో మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ వుంటుంది. మాన్సీ నువ్వు ఇంకా మారాలంటూ తమ ఇంట్లో వారు ఏం చేస్తున్నారో.. ఇంటి వారిని ఎలా లొంగదీసుకుంటున్నారో ఎబుతుంటారు. దీంతో మాన్సీ.. నీరజ్‌తో పాటు తన అత్త నిర్మలాదేవికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది. కట్ చేస్తే రెస్టారెంట్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ లేటవుతుండటంతో అను.. రాగసుధ ని నీ గురించి చెప్పమంటుంది. అయితే రాగసుధ తెలివిగా ముందు నీ ఫ్యామిలీ గురించి చెప్పుఅంటుంది.
Also Read: బాలీవుడ్ డైరెక్టర్ కోసం 'బబ్లీ బౌన్సర్'గా మారిన తమన్నా
అయనా అను ముందు నీ ఫ్యామిలీ గురించి చెప్పని తిరిగి అగడటంతో నేను ఒంటరిదానినని, నాకు ఎవరూ లేరని చెబుతుంది.. అయినా అను .. రాగసుధ గురించి ఇంకా తెలుసుకోవాలని తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది.. అయినా రాగసుధ చెప్పదు. ఇంతలో వీళ్లు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేస్తుంది. అయితే వెయిటర్ పొరపాటుగా కర్రీ రాగసుధ చీరపై పడేలా పెడతాడు. దీంతో క్లీన్ చేసుకోవడానికి వాష్ రూమ్ కి వెళుతుంది.. తిరిగి బయటికి వస్తుండగా .. రాగసుధకు ఆర్యవర్థన్ ఎదురుపడతాడు.. ఆ తరువాత ఏం జరిగింది? .. రాగసుధ ఏం చేసింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



