`గుప్పెడంత మనసు`: రాత్రి వసు, రిషి ల మధ్య ఏం జరిగింది?
on Nov 27, 2021

రిషి, వసుల చిలిపి తగాదాలు, గిల్లికజ్జాల నేపథ్యంలో సాగుతున్న సీరియల్ `గుప్పెడంత మనసు`. గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతూ ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఈ శనివారంలో 303వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒకసారి లుక్కేద్దాం.
వసు, మహీంద్ర రెస్టారెంట్‌లో కలుద్దామని అనుకున్న విషయం తెలుసుకున్న రిషి చాలా కాలంగా ద్వేషిస్తున్న జగతి కారులోనే రెస్టారెంట్‌కి బయలుదేరతాడు. కార్ డ్రైవ్ చేస్తూ రిషి.. వసు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని జగతిని అడుగుతాడు. అప్పుడు జగతి .. వసు ఏదంటే అదే ..దానికి నేను హెల్ప్ చేస్తాను అంతే` అంటుంది. వెంటనే నాకు వసు కావాలి మేడమ్ `అంటాడు రిషి. ఆ మాటలు విన్న జగతి షాక్‌కు లోనవుతుంది.
మాట మార్చిన రిషి మన కాలేజీలో ఫ్యాకల్టీ హెడ్‌గా వసు కావాలంటాడు. అయితే నేను చెప్పగలను కానీ ఒప్పించలేను కదా సార్ `అంటుంది జగతి. అడగడం అయితే మీరెందుకు తనని ఒప్పించమని మీకు బాధ్యత ఇస్తున్నాను` అంటాడు రిషి. ఇలా వీరి సంభాషణ జరుగుతుండగానే కార్ ఆగుతుంది. కట్ చేస్తే... రాత్రి కాలేజీలో రిషి బాస్కెట్ బాల్ ఆడుతుంటాడు. అదే సమయానికి వసు అక్కడికి వస్తుంది. తనని చూసి ఇదేంటి ఇలా వచ్చావ్? ` అంటాడు రిషి. అనుకోకుండా వచ్చాను సార్ అంటుంది వసు.. వెంటనే `నీకు బాస్కెట్ బాల్ ఆడటం వచ్చా? అంటాడు రిషి. రాదు రాదు అంటూనే రిషితో కలిసి వసు బాస్కెట్ బాల్ ఆడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



