Thanuja BB Journey video: జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయిన తనూజ.. మొత్తం కళ్యాణ్ తోనే!
on Dec 19, 2025

బిగ్ బాస్ సీజన్ చివరి దశకి చేరుకుంది. ఇప్పటివరకు ప్రయాణం ఒక లెక్క.. ఫినాలే వీక్ జర్నీ వీడియో ఒక లెక్క అన్నట్లుగా ఎడిటింగ్ చేశారు. ఎమోషనల్, కామెడీ కోపం అన్నీ కలిపి బిగ్ బాస్ ఇరగదీశాడని చెప్పాలి. ఇక ఫినాలే వీక్ లో ఇప్పటివరకు ఇమ్మాన్యుయేల్ జర్నీ వీడియో పూర్తి కాగా ఆ తర్వాత తనూజ వంతు వచ్చింది.
బిగ్ బాస్ తనూజ గురించి గొప్పగా చెప్పాడు. లేడీ ఫైటర్.. అన్నింట్లో మీ పర్ఫామెన్స్ ఉందని బిగ్ బాస్ చెప్పాడు. తనూజ జర్నీ వీడియో ప్లే చెయ్యగా అది చూస్తూ తనూజ ఎమోషనల్ అవుతుంది. తనూజకి సంబంధించిన ప్రతీ ఒక్కటీ జర్నీ వీడియోలో ప్లే చేశారు. భరణితో కలిసి ఉన్నప్పటివి అన్నీ కలిపి నాన్న బాండింగ్ బాగా చూపించారు. దానితో పాటు కళ్యాణ్ తో బాండింగ్ చూపిస్తూ లవ్ సాంగ్ కూడా ప్లే చేశారు. గేమ్ లో తను ఫైర్ తో ఆడింది చూసి తనూజ మురిసిపోయింది. జర్నీ వీడియో మొత్తం చూసి తనూజ ఎమోషనల్ అయింది.
చాలా థాంక్స్ బిగ్ బాస్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి చాలా థాంక్స్ అని తనూజ చెప్పింది. బిగ్ బాస్ ని అడిగి తనకి సంబంధించిన ఫొటోస్ తీసుకొని హౌస్ లోపలికి వెళ్ళింది. ఒరేయ్ మా నాన్నతో కన్నా నీతోనే ఎక్కువగా ఉన్నానురా.. అసలు ఎక్స్ పెక్ట్ చెయ్యలేదని కళ్యాణ్ తో తనూజ చెప్తుంది. నేనేం తప్పు చేసినా తనూజ నా వెనకాలే ఉంటుంది.. నన్ను కరెక్ట్ చెయ్యడానికి అన్నావ్.. అది వేరే లెవెల్ అసలు. నువ్వు మొన్న గొడవ అయినప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు లేచి కింద కూర్చొని ఉన్నావ్.. అది బాగా చూపించారని తనూజ చెప్పింది. తనూజ జర్నీ వీడియో చూసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



