ENGLISH | TELUGU  
Home  » TV News

ఇంటివాడు కాబోతున్న ఆకర్ష్ బైరముడి...ఘనంగా హల్దీ ఫంక్షన్ వేడుక

on May 10, 2024


బుల్లితెర నటుడు, మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఆకర్ష్ బైరముడి అంటే చాలు అమ్మాయిలంతా ఫిదా ఐపోతారు. చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. సీరియల్స్ లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆకర్ష్ తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ లో నటించాడు. జీ తెలుగులో "పున్నాగ" అనే సీరియల్ తో తెలుగు సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సీరియల్ లో 'అనిరుధ్'గా తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, అగ్ని పరీక్ష వంటి సీరియల్స్ తో అలరించాడు.

ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న "మామగారు" సీరియల్ లో నటిస్తున్నాడు. అలాంటి అందాల హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. కొంత కాలంగా ఐశ్వర్య అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆకర్ష్ తో ఫ్రెండ్స్ అంతా కలిసి బాచిలర్స్ పార్టీ చేశారు. ఇక ఇప్పుడు ఆకర్ష్ కి హల్దీ ఫంక్షన్ జరిగింది. ఈ సెలబ్రేషన్ కి బుల్లితెర సెలబ్రిటీస్ అంతా వచ్చారు. ఈ హల్దీ ఫంక్షన్ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. కర్ణాటకలోని సకలేష్‌పురాలో పుట్టి పెరిగాడు  ఆకర్ష్. అతని తండ్రి సుబ్బరాయుడు కాఫీ ప్లాంటర్ కాగా, తల్లి హేమావతి గృహిణి. ఆకర్ష్‌కి అనుష్ అనే అన్నయ్య ఉన్నాడు.  ఆకర్ష్ మొదట  కలర్స్ కన్నడలో 'లక్ష్మీ బారమ్మ' సీరియల్‌తో తన కెరీర్ స్టార్ట్ చేసాడు. 2018లో 'సీతా వల్లభ' సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.