Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!
on Dec 27, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
మరొకవైపు స్వప్న భోజనం టేబుల్ పై పెట్టి కాశీకి తినమని చెప్పి వెళ్ళిపోతుంది. భార్యగా ఎలా ఉండాలో దీప అక్కని చూసి నేర్చుకోమని కాశీ అనగానే బాధ్యతగా ఎలా ఉండాలో మా అన్నయ్యని చూసి నేర్చుకోమని స్వప్న అంటుంది. ఆ తర్వాత కాశీ కోపంగా వైరాకి ఫోన్ చేసి నాకు జాబ్ ఇస్తానన్నారని అడుగుతాడు. ఇచ్చాను ముందు బోనస్ గా అయిదు లక్షలు పంపిస్తున్నానని వైరా చెప్తాడు. మరొకవైపు సుమిత్ర గురించి దీప బాధపడుతుంది. అప్పుడే కార్తీక్, కాంచన వస్తారు. మావయ్య బయటకు వచ్చాడా అని దీప అనగానే వచ్చాడని శౌర్య ముందు అబద్ధం చెప్తాడు కార్తీక్. శౌర్య వెళ్ళిపోయాక రాలేదని కార్తీక్ చెప్పగానే దీప బాధపడుతుంది ఎందుకు బాధపడ్డాం.. నీ ఐడియా వళ్లే కదా అయనకి ఆ పరిస్థితి వచ్చిందని కాంచన అనగానే దీప షాక్ అవుతుంది. ఇవి నా మాటలు కాదు.. మా పిన్ని ఫోన్ చేసి తిడుతుందని కాంచన అంటుంది.
మరొకవైపు తన అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అయ్యాయని స్వప్నకి కాశీ చూపిస్తాడు. స్వప్న అది చూసి షాక్ అవుతుంది. జనరల్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఒక్క రోజులో అయిదు లక్షలు సంపాదించానని కాశీ పొగరుగా చెప్తాడు. మనం త్వరలో ఇల్లు తీసుకుంటున్నాం.. వెళ్లిపోతున్నాం ఇన్ని రోజులు మీ వాళ్ళు ఫుడ్ పెట్టినందుకు ఎంత కావాలో చెప్పమను ఇస్తానని కాశీ అనగానే స్వప్న షాక్ అవుతుంది.. ఆ తర్వాత కార్తీక్, దీపల దగ్గరికి స్వప్న వెళ్లి జరిగింది అంత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



