Illu illalu pillalu: అమూల్యకి పగ గురించి చెప్పిన విశ్వ.. పెళ్ళి జరుగుతుందా!
on Jan 29, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-380 లో .. రామరాజు ఇంట్లో లైట్లు తీసేస్తారు. ఇక శ్రీవల్లి, భాగ్యం ఇద్దరు మాత్రం అమూల్య కోసం వెతుకుతుంటారు. అప్పుడే తిరుపతి వారిని ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత శ్రీవల్లి, భాగ్యం ఇద్దరు కలిసి మెల్లిగా అమూల్యని బయటకి తీసుకెళ్ళాలని అనుకుంటారు. అప్పుడే రామరాజు నిద్రలేస్తాడు. ఇంట్లో కరెంట్ పోయింది.. ఫ్యూజ్ పోయినట్లుంది వెళ్ళి చూడరా చిన్నోడా అని రామరాజు చెప్తాడు.
దాంతో ప్రేమ, ధీరజ్ ఇద్దరు ఫ్యూజ్ ఉన్నదగ్గరికి వెళ్తారు. ఇక భాగ్యం, శ్రీవల్లి, అమూల్య ఒక దగ్గర దాక్కుంటారు. అక్కడ కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇక అదే సమయంలో షాడోలో శ్రీవల్లిని చూసి అక్కడ ఎవరో ఉన్నారనిపిస్తుందని ప్రేమ చెప్తుంది. కానీ అదేం లేదని ధీరజ్ తోసిపారేస్తాడు. ఆ తర్వాత కరెంట్ వస్తుంది. అప్పుడే విశ్వ దగ్గరికి అమూల్యని తీసుకెళ్తారు భాగ్యం, శ్రీవల్లి. దాంతో ఆనందరావుని విశ్వ వదిలేస్తాడు. ఇక ఆ తర్వాత విశ్వ తన మాయమాటలతో అమూల్యని ఒప్పించడానికి ట్రై చేస్తాడు. కానీ అమూల్య తన నాన్న తీసుకొచ్చిన సంబంధమే చేసుకుంటానని చెప్తుంది.
ఇక అమూల్యని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తాడు విశ్వ. మరోవైపు భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావు టెన్షన్ పడతారు. ఇక కంగారుగా ముగ్గురు ఇంటిలోకి వెళ్తారు. మనకేమీ తెలియనట్లు ఉండాలని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది. ఇక కంగారుగా లోపలికి వెళ్ళి వాటర్ తాగుతుంది శ్రీవల్లి. అప్పుడే వేదవతి వచ్చి ఏమైందని అడుగుతుంది. ఏం లేదని డైవర్ట్ చేస్తుంది. మరోవైపు ఓ గదిలో అమూల్యని బంధిస్తాడు విశ్వ. తెల్లారితే పెళ్ళి.. రామారాజు కొడుకులు చెప్పకుండా పెళ్ళి చేసుకున్నారు.. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా చేసిందని రామరాజు అనుకోవాలి. దానితో పాటు అందరు పరువు పోయిందని ఏడ్బాలి.. అదే మా పగ అంటూ భద్రవతి గురించి విశ్వ చెప్తాడు. ఇదంత నాటకమా అని విశ్వని అమూల్య అడుగుతుంది. నువ్వు నాటకం ఆడలేదా అని అమూల్యని అడుగుతాడు. ఆ తర్వాత తాళిని తీసుకొస్తాడు. అది చూసి అమూల్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



