‘నాకు నాన్నే లేడు’ అంటూ ఫీల్ అవుతున్న ఆది
on Aug 4, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. "నా కొడుకు" అనే టైటిల్ తో ఈ వారం ఎపిసోడ్ రాబోతోంది. ఇక ఈ వారం షోకి కృష్ణభగవాన్ గెస్ట్ గా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఎఫ్ 3 లో కొడుకులు తప్పిపోయిన థీమ్ తో ఈ వారం ఎపిసోడ్ అలరించనుంది . తప్పిపోయిన కొడుకుల కోసం భగవాన్ ఎదురు చూస్తూండేసరికి కొడుకులమంటూ ఆది, రాంప్రసాద్ వస్తారు. తప్పిపోయింది కొడుకులు కానీ దొంగ నా కొడుకులు కాదు అంటాడు భగవాన్. నేను మీ కూతురిని అంటూ వర్ష వచ్చేసరికి అవును నువ్వే నా కొడుకువి అంటాడు భగవాన్. తర్వాత నవీన వచ్చేసరికి మన ఇద్దరం తర్వాత పర్సనల్ గా మాట్లాడుకుందాం అంటూ కన్ను కొడతాడు భగవాన్.
తర్వాత అమ్మాయిల్ని, అబ్బాయిలు రెండు టీమ్స్ గా డివైడ్ చేసి పచ్చిమిరపకాయలు ఎవరు పది తింటారో వాళ్లే భగవాన్ కొడుకులు అంటూ అనౌన్స్ చేస్తారు. పచ్చిమిరపకాయలు తినలేక నాకు తండ్రి ఎవరూ లేరు నేను ఎవరికీ కొడుకును కాను పో అంటాడు. 100 కోట్ల ఆస్తి వద్దు ఏమీ వద్దు నాకు అసలు చెప్పాలంటే నా కొడుకు అనే ఈ ఈవెంట్ లో నేను లేనే లేను అంటూ రష్మీ మీద సీరియస్ ఐపోతాడు. ఇంతలో భగవాన్ ఒక మాట ఆదితో అంటారు అందరూ చచ్చిపోయి నువ్వు, ఫైమా ఉంటె ఎం చేస్తారు అని. దాన్ని చంపి నేను చచ్చిపోతా అంటూ ఆది ఫన్ క్రియేట్ చేస్తాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
