ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 హోస్ట్ గా శ్రీరామ్ చంద్ర...
on May 6, 2024
సింగర్ శ్రీరామా చంద్ర అంటే చాలు ఒక పాటగాడుగా మాత్రమే చాలామందికి గుర్తుంటాడు..ఐతే అతనొక బిగ్ బాస్ కంటెస్టెంట్, హోస్ట్, అలా ఝలక్ ధికలాజా అనే హిందీ డాన్స్ షోలో మంచి డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి శ్రీరామచంద్రకు ఇప్పుడు ఒక ప్రశ్న ఎదురయ్యింది అంట. దాన్ని ఆడియన్స్ తో షేర్ చేసుకున్నాడు. ఆ వీడియోని రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. "హలో అందరూ..ఎలా ఉన్నారు.
చాలా రోజులకు మిమ్మల్ని కలుస్తున్నాను. విషయం ఏమిటి అంటే నాకు ఆహా వాళ్ళ నుంచి కాల్ వచ్చింది. ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టార్ట్ కాబోతోందట.. ఆ షోకి నన్ను హోస్ట్ గా చేయమని అడుగుతున్నారు. మీరేమంటారు. హోస్ట్ గా చేయమంటారా ? ఇండియన్ ఐడల్ సీజన్ 1 చేసాం సూపర్ హిట్ అయ్యింది...ఇప్పుడు సీజన్ 3 కి అడుగుతున్నారు ..ఒప్పుకుందామా ? లేదా ? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాలను చెప్పాలండి. మీరు సై అంటే నేను రై అంటాను" అంటూ నెటిజన్స్ ని అడిగాడు. ఇక నెటిజన్స్ అంతా కూడా రిప్లైస్ ఇచ్చారు. "ఒప్పుకోండి..ఐతే జడ్జిగా వస్తే చేయండి. అదే హోస్ట్ గా ఐతే ఎక్కువ పాటలు పాడండి. నిత్యా మీనన్ ని కూడా షోకి తీసుకురండి" అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇక శ్రీరామా చంద్ర బాలీవుడ్లో సుభాన్ అల్లా, బల్మా, అల్లా దోహై వంటి పాటలు పాడారు. సౌత్‌లో కూడా తన సత్తా చాటుకున్నారు. గెలుపు తలుపులే, అటు ఇటు ఊగుతూ, మరీ అంతగా, ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. ఇలా తెలుగులో చాలా పాటలు పాడారు. ఇప్పటిరవకు 9 భాషల్లో 500 పైగానే పాటలు పాడిన శ్రీరామచంద్ర ‘పాపం పసివాడు’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు.