డేంజర్ జోన్ లో శోభాశెట్టి, గౌతమ్, అర్జున్.. శివాజీ నెంబర్ వన్!
on Nov 28, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో పదమూడవ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగాయి. ఇందులో అందరితో పోలిస్తే గౌతమ్, అర్జున్, శోభాశెట్టిల నామినేషన్ సిల్లీగా అనిపించాయి.
పల్లవి ప్రశాంత్ ని శోభాశెట్టి సేఫ్ ప్లేయర్ అని నామినేట్ చేయడం చాలా సిల్లీ రీజన్ అని స్పష్టంగా తెలుస్తుంది. అలాగే గత కొన్నివారాలుగా గౌతమ్ చేసే నామినేషన్ ఒకేవిధంగా ఉంటున్నాయి. ప్రతీసారీ రావడం ప్రశాంత్, శివాజీలని నామినేట్ చేయడం వెళ్ళిపోవడం ఇదంతా ఒక పగతీర్చుకుంటున్నట్టుగా కన్పిస్తుంది. అయితే అంబటి అర్జున్ చేస్తున్న ఇన్ ఫ్లూయన్స్ గౌతమ్ మీద గట్టిగానే ఉంది. అందుకే శివాజీ ఏం చేసిన, ఏం మాట్లాడిన అందులో తప్పు కోసం ఎదురు చూస్తూ తన ఆటని, తన స్ట్రాటజీని మర్చిపోయి హౌస్ లో వీక్ కంటెస్టెంట్ గా మిగిలిపోయాడు. దీంతో ఈ రోజు నమోదైన ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నాడు. ప్రస్తుతం జరిగన ఓటింగ్ లో శోభాశెట్టి చివరి స్థానంలో ఉంది.
ఓటింగ్ లో మొదటి స్థానంలో శివాజీ, రెండవ స్థానంలో ప్రశాంత్, మూడవ స్థానంలో యావర్ ఉండగా.. అంబటి అర్జున్, శోభాశెట్టి, గౌతమ్ ఈ ముగ్గురు లీస్ట్ లో ఉన్నారు. గత కొన్నివారాలుగా ఆడియన్స్ శోభాశెట్టిని ఎలిమినేట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నా.. బిగ్ బాస్ తనకే ఫేవరిజం చేస్తున్నాడని తెలుస్తుంది. మరి ఈసారి లీస్ట్ లో ఉన్న శోభాశెట్టిని ఎలిమినేట్ చేస్తాడా లేక అన్ ఫెయిర్ నామినేషన్ చేస్తున్న గౌతమ్, అర్జున్ లలోఒకరు బయటకు వస్తారా తెలియాలంటే మరో అయిదు రోజులు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
