Sanjana Bigg Boss Journey: ఎంటర్‌టైన్‌మెంట్ కా మా సంజన.. దిజ్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డు!
on Dec 20, 2025

ఇది ఫినాలే కాదు.. కానీ అంతకు మించి అన్నట్టుగా నిన్నటి శుక్రవారం నాటి ఎపిసోడ్ సాగింది. మొదటగా పవన్ కళ్యాణ్ పడాల జర్నీ వీడియో ప్లే చేయగా ఆ తక్కువ సంజన జర్నీ వీడియో ప్లే చేశాడు బిగ్ బాస్.
సీజన్-9 మొదలైన కొన్ని రోజుల్లోనే ఏంట్రా బాబు ఈ సీజన్-9 ఇంత సప్పగా సాగుతోందని ఆడియన్స్ అనుకుంటున్న సమయంలో సంజన గుడ్డు దొంతనం చేసింది.. దాంతో హౌస్ లో గొడవలు షురు అయ్యాయి. ఇక అందరి మధ్య గొడవలు ముదిరాయి. ఇక ఆ తర్వాత సంజన చేసిన ప్రతీ పని మిగిలిన హౌస్ మేట్స్ కి పెద్దగా కనిపించేది కానీ సంజన మాత్రం కంటెంట్ ఇస్తూ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గకుండా చూసింది. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్, సంజన కలిసి నిజమైన కొడుకు, తల్లి లాగా ఉన్నారు. బిగ్ బాస్ కూడా సంజన జర్నీ వీడియోలో ఎక్కువ భాగం వాళ్ళిద్దరి బాండింగ్ చూపించాడు.
ఇక సంజన గురించి కొన్ని మాటలు చెప్పాడు బిగ్ బాస్. వంటగదిలో ఉన్నా.. బెడ్‌రూమ్‌లో కబుర్లు చెప్తున్నా.. సంజన ఎక్కడుంటే అక్కడ ఏదో జరగబోతుందని ఆసక్తిని ప్రేక్షకుల్లో కల్పించారు.. సంజన సైలెన్సర్‌గా, సంజూ బాబాగా, మమ్మీగా, ఎవరికీ అర్థం కాని గేమర్‌గా వివిధ పాత్రల్లో ప్రతి నిమిషం వినోదాన్ని పంచడానికి ప్రయత్నించారు.. ఆటలో మిగతావారు మీకన్నా బలంగా ఉన్నా. వారికి మిగతావారి మద్దతున్నా.. మీరు ఎప్పుడూ అధైర్యపడలేదు.. ఎవరి మీదో ఆధారపడి ఆడటానికి మీరు ఈ ఇంట్లోకి రాలేదు.. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చింది.. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలి వ్యక్తి ఎవరైనా సరే వెనక్కి తగ్గని మొండి ధైర్యం మీ సొంతం అంటూ బిగ్ బాస్ భారీగా ఎలవేషన్ ఇచ్చాడు. నిజానికి సంజన చాలా ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. అయితే అది ఎక్కువగా ఫన్ వే లో చూపించలేదు బిగ్ బాస్. కానీ ఇమ్మాన్యుయేల్, సంజనల బాండింగ్ బాగుంది. హౌస్ లో టాప్-5 కి సంజన అర్హురాలా కాదా కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



