ఈ యాంకర్ వద్దు అంటూ ఇండైరెక్ట్‌గా చెప్పిన కమెడియన్స్.. ఫైర్ ఐన రష్మీ!
on Feb 6, 2023
.webp)
బుల్లితెర మీద యాంకర్ ల గోల ఎక్కువైపోయింది. యాంకర్ లా గోలా అంటే యాంకర్ లు చేసే హడావిడి కాదు. ఆ విషయం తెలియాలి అంటే ఇటీవల ప్రసారమైన "శ్రీదేవి డ్రామా కంపెనీ" షో చూస్తే అర్ధమవుతుంది. రష్మీ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ఈ వారం "నాటి నరేష్ పెళ్లి గోల" కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. అలాగే ఈ షోకి "రైటర్ పద్మభూషణ్" మూవీ టీం కూడా ప్రమోషన్స్ లో భాగంగా స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చింది. సుహాస్, టీనా, గౌరీ, ప్రశాంత్ వచ్చారు. తర్వాత ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ "సుహాస్ ఈ షో మొత్తం నువ్వు, రష్మీ యాంకరింగ్ చేస్తే చూడాలని ఉంది" అన్నాడు. "నేను చేయలేనండి" అని సుహాస్ అనేసరికి "ఆ అమ్మాయి కూడా ఏమీ చేయదండి బాబు" అని రాంప్రసాద్ అనడంతో రష్మీ ఒక ఫన్నీ లుక్ ఇచ్చింది.
"నేను ఒక లింక్ చెప్తాను అది చెప్పండి" అని రష్మీ సుహాస్ తో చెప్పేసరికి "నాకు బ్రాండ్ పేర్లు వరసగా చదవడం రాదండి" అన్నాడు. "ఆ అమ్మాయి కూడా చదవదండి చెవిలో చెప్తారు" అని కామెడీ చేసాడు రాంప్రసాద్. అలా యాంకరింగ్ ఎలా చేయాలో సుహాస్ కి, టీనాకి, గౌరీకి నేర్పించింది. గౌరీ మాత్రం సూపర్ గా తనకు వచ్చినట్టు యాంకరింగ్ చేసేసరికి "శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్త యాంకర్ వచ్చింది" అని రాంప్రసాద్ గట్టిగా అరిచాడు. "ఈ షో వాళ్లకు గౌరీని చూపించకండి" అని ఆట పట్టించింది రష్మీ. " నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరే యాంకర్...ఇది ఫిక్స్ " అన్నాడు నాటీ నరేష్. ఆ మాటకు కోపం వచ్చిన రష్మీ "హే కూర్చో" అంది. "యాంకర్ ని మార్చాలి అనేసరికి ఎంత కోపం వచ్చిందిరా" అన్నారు నరేష్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



