పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన పూర్ణ
on Jul 4, 2022
పూర్ణ ఇప్పుడు బుల్లి తెర మీద మంచి ఫేమస్ నేమ్. 'శ్రీ మహాలక్ష్మి' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి తర్వాత అల్లరి నరేష్ తో 'సీమ టపాకాయ్' మూవీలో నటించి క్రేజ్ సంపాందించుకుంది. అవును, లడ్డుబాబు, రాజు గారి గది, జయమ్ము నిశ్చయమ్మురా వంటి మూవీస్ లో యాక్ట్ చేసింది. తర్వాత బుల్లి తెర మీద బాగా పాపులర్ అయ్యింది పూర్ణ. వీటితో పాటు ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఆడియన్స్ తో టచ్ లోనే ఉంటుంది. ఇక ఈమె కొన్ని డాన్స్ అండ్ రియాలిటీ షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తోంది పూర్ణ. ఐతే ఇటీవల పూర్ణ బిజినెస్ మ్యాన్ ఐన షానిద్ అసిఫ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
తాజాగా తన పెళ్లి డేట్ ఫిక్స్ ఐనట్లు తెలుస్తోంది. నవంబర్ 6న తాను షానిద్ ని వివాహం చేసుకుంటున్నట్లు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో స్టేజి మీద అనౌన్స్ చేసింది. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ తాను దుబాయ్ కూడా వెళ్ళిపోతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పూర్ణ నటించిన దాదాపు అరడజను చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక పూర్ణ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో 'పేరెట్టి నేనెట్టా' సాంగ్ కి అలాగే 'శ్రీవల్లి' సాంగ్ కి లంగా వోణిలో డాన్స్ చేసి స్టేజిని ఒక ఊపు ఊపేసింది. ఇక నాటీ నరేష్ వచ్చి పూర్ణ డాన్స్ బాగుందని దిష్టి తగలకుండా ఉండాలి అంటూ స్టేజి మీదకు వచ్చి పూర్ణ బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఇక పూర్ణ కూడా నరేష్ ని నచ్చో అని పిలుస్తూ నరేష్ అంటే ఇలా ఉంటేనే ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి తర్వాత యాక్టింగ్ కి గుడ్ బై చెప్తాను అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చేసింది పూర్ణ.