Jayam Serial : పారు ప్లాన్ ఫెయిల్.. పంతులు ఏం చేయనున్నాడు!
on Feb 10, 2026

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -188 లో..... ఇంట్లో కొత్త దంపతులు శివ లింగం తో పూజ చేయాలి అది మన వంశపారం పర్యం గా వస్తుంది ఆలా చేస్తేనే మన వంశం ముందుకి సాగుతుంది అని శకుంతల అంటుంది ఆలా మీ వంశం ముందుకి సాగనివ్వను అని వీరు అనుకుంటాడు.
పంతులు స్థానంలో వీరు తన మనిషిని తీసుకొని వచ్చి పంతులు గారు ఎక్కడికో వెళ్లారట.. ఈ పంతులిని పంపించాడని వీరు అంటాడు. మరొకవైపు గంగని లేకుండా చెయ్యడానికి పారు పాములు పట్టే అతన్ని పిలిపించి గంగ చీర ముక్కని అతనికి ఇస్తుంది. ఈ పాము చీర వాసన పసిగట్టి వాళ్ళని వెళ్లి కాటేస్తుందని అతను చెప్తాడు. అలా అతను చెప్పగానే పారు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత గంగ రెడీ అవుతుంటే రుద్ర వెళ్లి ఇలా కాదు పూజకి మూడు అడ్డం బొట్లు పెట్టుకోవాలని రుద్ర పెడుతాడు. మరొకవైపు పాముని అతడు వదులుతాడు. రుద్ర శివలింగం తీసుకొని వస్తాడు. గంగ దగ్గర పాము ఉండడం చూసి గంగకి చెప్తాడు. పాముని కొట్టాలని వీరు అంటాడు. వద్దని గంగ పాలు తీసుకొని వచ్చి పాముకి పెడుతుంది. పాము తాగి వెళ్తుంది. గంగ నీ వల్ల పాము ఎటు వెళ్లిందో ఎవరిని కాటేస్తుందోనని పారు అంటుంది.
ఆ తర్వాత పూజ మొదలవుతుంది. కళ్ళు మూసుకొని శివ నామ స్మరణం చెయ్యండి అని పంతులు చెప్పగానే అందరు కళ్ళు మూసుకుంటారు. అప్పుడే పంతులు శివలింగం ప్లేస్ లో అలాంటిదే వేరొక శివలింగం పెడతాడు. అందరు కళ్ళు తెరిచి మొక్కుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



