ENGLISH | TELUGU  
Home  » TV News

ఒరేయ్ అన్నయ్య అంటే మా అమ్మ కొడుతోంది

on May 22, 2023


సిక్స్త్ సెన్స్ సీజన్ 6  ఈ వారం షో రెండు వెబ్ సిరీస్ మధ్య కామెడీగా, ఫన్నీగా, పోటాపోటీగా జరిగింది. ఇందులో "డెడ్ పిక్సెల్స్ నుంచి రోనాక్, నిహారిక, అక్షయ్ వచ్చారు, సేవ్ ది టైగర్స్ నుంచి అభినవ్, మహి వి గౌతమ్, పావని వచ్చారు. ఈ రెండు వెబ్ సిరీస్ మంచి కలెక్షన్స్ తో, టాప్ రేటింగ్స్ తో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్నాయి. అలాంటి ఈ రెండు వెబ్ సిరీస్ యాక్టర్స్ మధ్య ఈ వారం షో నడిచింది. ఫస్ట్ రౌండ్ లో నిహారికకు ఓంకార్ ఒక క్వశ్చన్ వేసాడు "ఇంట్లో వరుణ్ తేజ్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు" అని అడిగాడు. "అంటే మా అన్నయ్యకు చాల ముద్దొస్తే తల్లి అంటాడు అప్పుడు నేను ఏం కావాలన్నా అని అడగాలి..తల్లీ అంటే ఏదో ఒకటి ఎదుగుతాడని అర్ధం కొంతమంది అన్నయ్యని ఒరేయ్ అన్నయ్య అంటారు కదా అలా పిలిస్తే మా అమ్మ నన్ను కొట్టిద్ది" అని చెప్పింది.

సెకండ్ రౌండ్ లో నిహారికకు కొన్ని పజిల్ క్వశ్చన్స్ వేసాడు ఓంకార్ "అన్ని వెజిటల్ కలిసి బార్ కి గనక వెళ్తే ఆ బార్ పేరేంటి" అని అడిగేసరికి "సాంబార్" అని చెప్పింది " ఒక క్లాస్ లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు..వాళ్ళ ముందు టీచర్స్ ఎందుకు సన్ గ్లాసెస్ వేసుకున్నారు" అని అడిగాడు "ఎందుకంటే స్టూడెంట్స్ చాల బ్రైట్ కాబట్టి" అని చెప్పింది నిహారిక. ఇలా ఈ షోలో రెండు టీమ్స్ పోటీ పడగా "సేవ్ ది టైగర్స్" టీం గెలిచింది. "మా షోలో ఎలాంటి ఐతే టెన్షన్ పడుతూ ఆడతామో అలాంటి టెన్షన్ మళ్ళీ మీ గేమ్ షోలో కనిపించింది. గన్నులు, బాంబులు ఇలాంటివి చాలా ఉన్నాయి" అని చెప్పింది నిహారిక. నిహారిక కొణిదెల ‘ఒక మనసు’ మూవీ ద్వారా 2016లో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఆమె తన జర్నీ మొదలుపెట్టి రీసెంట్ గా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ,  హలో వరల్డ్" వంటి వెబ్ సిరీస్ కి  ప్రొడ్యూసర్ గా వ్యవహరించి సక్సెస్ ని అందుకుంది.

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.