టీవీ సీరియల్ కి రూ.130 కోట్ల బడ్జెట్!
on Feb 2, 2022

ఈరోజుల్లో వంద కోట్ల బడ్జెట్ తో సినిమా తీయడం అనేది కామన్ అయిపోయింది. అయితే వంద కోట్లకు పైగా బడ్జెట్ తో ఓ సీరియల్ తెరకెక్కుతుందనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సీరియల్ కి వంద కోట్ల బడ్జెట్ ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన 'నాగిన్' సీరియల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2015 లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటిదాకా ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ ని హిందీ, తెలుగు(నాగిని)తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం చేశారు. త్వరలో ఈ సీరియల్ ఆరవ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇందులో హిందీ బిగ్‌బాస్ 15 విజేత తేజస్వీ ప్రకాశ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సీజన్ లో సినిమాలను తలపించేలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అందుకే ఈ సీజన్ కు ఏక్తా కపూర్ దాదాపు రూ.130 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఓ సీరియల్ కి ఈ స్థాయిలో ఖర్చు పెట్టడమనేది సంచలనంగా మారింది.
కాగా, నాగిన్ 6వ సీజన్ ఫిబ్రవరి 12 నుంచి కలర్స్ టీవీలో ప్రసారం కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



