Bigg Boss : ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ని రివీల్ చేసిన బిగ్ బాస్!
on Oct 2, 2024
బిగ్ బాస్ సీజన్-8 మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్‌తో మొదలైంది. మొదటివారం బేబక్క, రెండో వారం శేఖర్ బాషా, మూడోవారం అభయ్ నవీన్, నాలుగోవారం సోనియా ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగు వారాలు ముగిసేసరికి పదిమంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు.
ఇక ఈ వారం మరో ఇద్దరు బయటకు వస్తున్నారు. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండటంతో పాటు వీకెండ్ ఎలిమినేషన్ ఉంటుంది. అయితే వచ్చేవారం హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా కొత్త కంటెస్టెంట్స్‌లు హౌస్‌లోకి రాబోతున్నారు. వారిలో కొంతమంది పేర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. వారిలో యాంకర్ రవి, గంగవ్వ, దిల్ సే మెహబూబ్, నయని పావని, తీన్మార్ సావిత్రి, టేస్టీ తేజ, రోహిణి, ముక్కు అవినాష్ హౌస్ లోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో టేస్టీ తేజ ఇప్పటికే కన్ఫమ్ అయినట్టు తెలుస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి.. పాత కంటెస్టెంట్స్‌నే వైల్డ్ కార్డ్‌ల ద్వారా హౌస్‌లోకి పంపిస్తున్నారనేది అందరికి తెలిసిందే.
సీజన్ 8 ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ టేస్టీ తేజా పేరును అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు బిబి టీమ్. ఇన్ స్టాగ్రామ్ లో స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రెండు అఫీషియల్ పేజీలలో కంటెస్టెంట్ ఎవరో కనిపెట్టండి అంటు పోస్ట్ వేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తేజా ఫేస్ రివీల్ చేయకుండా.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరో కనిపెట్టండి అంటూ అతని నీడను మాత్రమే రివీల్ చేశారు. ఇక ఆ బాడీ సైజు చూసి , ఆ కటౌట్ చూస్తే అతనే టేస్టీ తేజ అని ఎవరికైనా అర్థమవుతుంది. మరి మీకేమనిపిస్తోందో కామెంట్ చేయండి.
Also Read