ENGLISH | TELUGU  
Home  » TV News

బాలయ్య 'అన్ స్టాపబుల్' గెస్ట్ గా మహేష్ బాబు!

on Dec 3, 2021

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రెండు ఎపిసోడ్స్ కి మోహన్ బాబు ఫ్యామిలీ, నాని గెస్ట్ లుగా రాగా.. మూడో ఎపిసోడ్ కి బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్ లుగా వచ్చారు. ఇక షో నాలుగో ఎపిసోడ్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

'అన్ స్టాపబుల్'తో హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. బాలయ్య ఎనర్జీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ షోకి వస్తున్న రెస్పాన్స్ చూసి పలువురు స్టార్స్ ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తాజాగా షో నిర్వాహకులు షోలో గెస్ట్ గా పాల్గొనాలని మహేష్ ని సంప్రదించగా.. ఆయన వెంటనే ఓకే చెప్పాడని సమాచారం. మహేష్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. బాలయ్య ఎనర్జీకి మహేష్ సెటైర్స్ తోడైతే ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.

బాలయ్య తాజాగా 'అఖండ' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.ఈ సినిమాకి మొదటి షో నుంచే సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పై మహేష్ సంతోషం వ్యక్తం చేశారు. మూవీ టీమ్ కి కంగ్రాట్స్ చెప్పాడు. బాలయ్య-మహేష్ మధ్య మంచి బాండింగ్ ఉండటం, అఖండ సక్సెస్ పై మహేష్ సంతోషం వ్యక్తం చేయడం వంటి వాటిని దృష్టిలో బాలయ్య షోలో మహేష్ పాల్గొనే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో కూడా మహేష్ పాల్గొన్నాడు. ఇప్పుడు మరో నందమూరి హీరో షోలో మహేష్ సందడి చేస్తాడేమో చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.