శ్రీకృష్ణుడి లాంటి భర్త రాబోతున్నాడు...త్వరలో చూపిస్తాను
on Nov 15, 2023
.webp)
మాధవీలత అంటే చాలు నచ్చావులే మూవీ గుర్తొస్తుంది. తర్వాత స్నేహితుడా, అరవింద్ 2 మూవీస్ లో ఆమె యాక్షన్ గుర్తొస్తుంది. ఆ తర్వాత మూవీస్ కి ఆమె పూర్తిగా దూరమైపోయారు.తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవి లతా వాటిల్లో యాక్టివ్ గా లేరు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంటున్నారు. ఎక్కడ ఏ ఇష్యూ చూసినా, తన చెవిన పడినా, కంట పడినా వాటిని తన కామెంట్స్ తో చీల్చి చెండాడేస్తోంది. అలాంటి మాధవి లతా తాను చేసుకోబోయే అబ్బాయిని ఆ శ్రీకృష్ణుడే చూపించాడని కానీ దిష్టి తగులుతుంది అని ఎవరికీ చూపించడం లేదు అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
.webp)
"చాలా మంది అమ్మాయిలు నాకు టెక్స్ చేస్తున్నారు, వారు నా వీడియోలను చూసి చాలా సంతోషంగా ఉండడంతో పాటు ఇన్స్పైర్ అవుతున్నారు. నేను త్వరలో స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తాను ఎందుకంటే చాలా మంది సోదరులు కూడా సందేశాలు పంపిస్తున్నారు ..వారందరికీ చాలా ధన్యవాదాలు ... కొంతమంది అబ్బాయిలు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు... బాయ్స్...నా శ్రీకృష్ణుడు నాకు తనలాగే అద్భుతమైన లక్షణాలను ఉన్న వ్యక్తిని చూపించాడు... దిష్టి తగులుతుంది కనుక తనని మీకు చూపించడం.. లేదు టైం వచ్చినపుడు చూపిస్తా..... మీరు నేను ఇంకా భూమి మీద ఉంటాం కదా..వెయిట్ " అంటూ శ్రీకృష్ణుడు లాంటి గుణగణాలున్న వ్యక్తి తన జీవితంలోకి రాబోతున్నాడంటూ ఒక వ్యక్తి గురించి ఈ తరహా ఇంటరెస్టింగ్ న్యూస్ ని షేర్ చేసుకుంది మాధవీ లతా. మాధవీ లత శ్రీకృష్ణుడికి వీర భక్తురాలు. ఆమె చేసే ఎక్కువ రీల్స్ కూడా ఆయన మీద ఉంటాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



