ENGLISH | TELUGU  
Home  » TV News

నేను పిల్లల్ని కనలేను కదా.. అందుకే నా మీద ప్రేమ తగ్గిందా!

on May 12, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -467 లో..  మురారి, కృష్ణతో మాట్లాడతాడు. ఏంటి కృష్ణ ఏం ఆలోచిస్తున్నావ్.? పర్వాలేదు చెప్పు అని మురారి అంటాడు. ఏం లేదు ఏసీపీ సర్.. మీకు నా మీద ప్రేమ తగ్గింది కదా? నేను పిల్లల్ని కనలేను.. గొడ్రాల్ని అని నా మీద ప్రేమ తగ్గిపోతుందా అని కృష్ణ అంటుంది. అయ్యో కృష్ణా ఏంటా మాటలు.. కొడతాను జాగ్రత్త... అలా ఎందుకు ఆలోచిస్తున్నావ్.. నీ మీద ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు. అయిన నువ్వు గొడ్రాలివి కాదు. ఆల్రెడీ మన బిడ్డ మరొకరి కడుపులో పెరుగుతోందని మురారి అంటాడు. ఆ మాటల మధ్యలోనే ఆదర్శ్, మీరాల పెళ్లి విషయం వస్తుంది. మన బిడ్డ బాగా పుట్టాలని ఆ దేవుడ్ని కోరుకుంటూ పూజ చేస్తున్నాం కదా. అంతా మంచే జరుగుతుంది సరేనా.. ఎక్కువగా ఆలోచించకు.. అప్పటితో ఈ ఇంట్లో అంతా శుభమే జరుగుతుందని మురారి అంటాడు. అప్పుడే ఎక్కడ? ఆదర్శ్, మీరాల పెళ్లి చెయ్యాలి కదా అని కృష్ణ అనగానే.. మురారి షాక్ అవుతాడు. 

అదేంటి.. అదేం వద్దు. ఆ మీరా మంచిది కాదన్నావ్ కదా నువ్వే? తనకు దూరంగా ఉండాలని చెప్పి.. ఇప్పుడేంటి ఆదర్శ్‌తో పెళ్లి అంటున్నావని మురారి అంటాడు. అన్నాను.. మీరా అంత మంచిది కాదు. కానీ ఆదర్శ్, మీరాలు ఒకరిని ఒకరు ఇస్టపడుతున్నట్లే అనిపిస్తోంది. ఆదర్శ్ మనసులో అయితే మీరా ఉంది కదా.. పైగా మీరా పెళ్లి అయితే సెట్ అవుతుందేమో.. మంచిగా మారుతుందేమో కదా.. మనం అయితే ఆదర్శ్, మీరాల పెళ్లి చేయ్యాల్సిందేనని కృష్ణ అంటుంది. అమ్మో ఇప్పుడు కాదంటే.. కృష్ణకు డౌట్ వస్తుంది. రెండు నెలలు జాగ్రత్తగా సరే అనేసి గడిపితే.. మూడో నెలలో పిండం నిలబడిపోతుంది. మీరా గర్భవతి అన్న విషయం తెలిసి పెళ్లి కూడా ఆగుతుంది కదా అని మనసులో మురారి అనుకుంటాడు. 

ఇక నిజంగానే మీరా కడుపుతో ఉన్న విషయం కృష్ణకు తెలిసిపోతుంది. కానీ పైకి చెప్పదు. అంతా బాగానే ఉంది అంటుంది. మీరా తల్లి కాబోతుందని ఎందుకు చెప్పడం లేదు? బహుశా పెళ్లి కాలేదు కాబట్టి చెప్పడం లేదేమోనని మురారి అనుకుంటాడు. మీరా కళ్ళు తెరవకుండా నటిస్తూనే ఉంటుంది. ఇక భవాని కంగారుగా వస్తుంది. అమృత ఒకసారి నువ్వు కూడా చూడు.. తనకు ఏమైందోనని అనడంతో.. అమృత కూడా చెక్ చేస్తుంది. మీరా ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసుకున్న అమృత నిజం చెబుతుందా? లేక కృష్ణ నిజం దాస్తుందని అర్థం చేసుకుని తనేం చెప్తుందనేది ఆసక్తిగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.