ENGLISH | TELUGU  
Home  » TV News

Krishna Mukunda Murari: మా కోడలు కడపుతో ఉంది.. చెక్ చేసి చెప్పు!

on May 8, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -464 లో... మురారీకి మీరా ఒట్టు పెట్టి మరీ.. నిజం చెబుతుంది. నేనే మీ బిడ్డను మోసేది. మీ బిడ్డ కృష్ణ కడుపులో పెరిగినా, నా కడుపులో పెరిగినా ఒక్కటే.. పైగా నేను మీ కుటుంబానికి ఎంతో రుణపడ్డాను. ఆ కృతజ్ఞ‌తతోనే ఇదంతా చేశానని అంటూ చెబుతుంది. అలాగే మురారి నుండి స్పెషల్ కేరింగ్‌ని ఆశిస్తుంటుంది. ఇదంతా ఆసుపత్రిలో చెబుతుంది కాబట్టి.. ఆసుపత్రి నుంచి మీరాని ఇంటికి కారులో ఎక్కించుకుని బయలుదేరతాడు మురారి. దాంతో మీరా అలియాస్ ముకుంద మాత్రం.. మురారీ పక్కనే కారులో కూర్చున్నందుకు మురిసిపోతుంటుంది. ఇప్పుడు మురారీ బిడ్డకు తల్లిని అయ్యాను.. రేపు మురారికి భార్యను కూడా అవుతానని తనలో తానే ఊహించుకుంటూ పొంగిపోతుంది.

మరోవైపు కృష్ణతో మాట్లాడుతుంది రజిని. ఆదర్శ్‌తో సంగీత పెళ్లి చేస్తానని మీరా మాటిచ్చినట్లుగా చెబుతుంది. అయితే ఆదర్శ్‌తో కావాలనే రాసుకుని పూసుకుని తిరుగుతోంది. అలా అయితే ఆదర్శ్ ఇంకెప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు? ఈ విషయంలో నువ్వే నాకు సాయం చెయ్ కృష్ణా అని రజిని అంటుంది. కృష్ణతో రజిని అలా రిక్వెస్ట్ గా మాట్లాడటంతో.. రజిని చెప్పిన మాటల్లో మీరా మీద కృష్ణకి అనుమానం మొదలవుతుంది. అమ్మో మీరా చాలా ప్రమాదమన్న మాట. అసలు తను డబుల్ గేమ్ ఎందుకు ఆడుతుందని కృష్ణ ఆలోచనలో పడుతుంది. రజినీకి మాటిచ్చి సాగనంపి అదే ఆలోచిస్తుంటుంది కృష్ణ. ఇక సంగీతతో  మధు మాట్లాడుతుండగా..రజినీకి మీరా ఇచ్చిన మాట గురించి తెలుసుకుంటాడు. నాకు ఆదర్శ్‌తో పెళ్లి చేస్తానని ఆ మీరా మా అమ్మకి మాట ఇచ్చింది. కానీ తను మాత్రం ఆదర్శ్ బావతో చాలా సన్నిహితంగా ఉంటోంది చూశావా మధు బావా అని మధుతో సంగీత నిజం చెప్తుంది. కాసేపటికి కృష్ణ దగ్గరికి మధు వచ్చి.. సంగీత చెప్పిన విషయాన్ని చెప్తాడు. ఇక అది విన్న కృష్ణ.. మీరా మీద మరింత అనుమానాన్ని, అసహ్యాన్ని పెంచుకుంటుంది. సరిగ్గా అప్పుడే రేవతి వస్తుంది.

ఇక రేవతి, కృష్ణ బయట ఉండగానే.. మీరా, మురారీ ఇద్దరు కారులో వస్తారు. మురారీ కారులోంచి మీరా రావడంతో రేవతి, కృష్ణ కాస్త కోపంగా చూస్తారు. కడుపుతో ఉన్నదాన్ని క్యాబ్‌లో పంపించి.. ఏం లేని దాన్ని కారులో తీసుకొచ్చేవేంట్రా అని మురారీని రేవతి తిడుతుంది. దారిలో కనిపిస్తే తీసుకొచ్చానమ్మా అంటూ మురారి కవర్ చేస్తాడు. ఇక కాసేపటికి భవాని స్నేహితురాలు డాక్టర్ అమృత ఇంటికి వస్తుంది. తను రాగానే సరదాగా కబుర్లు చెప్తుంది భవాని. కాసేపటికి కృష్ణ, మురారీలు లోపలికి వస్తారు. వారిని చూసిన భవాని.. మా కోడలు కృష్ణ కడుపుతో ఉంది.. తనను చెక్ చేసి ఎలా ఉందో చెప్పమని అమృతతో భవాని అంటుంది. దాంతో కృష్ణ, ‌మురారి ఆశ్చర్యంగా చూస్తారు. మిగతావరంతా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.