Brahmamudi : మినిస్టర్ ఇంటికి రాజ్, కావ్య.. తమ పాపని దక్కించుకుంటారా!
on Jan 30, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -942 లో...... కావ్య తన బిడ్డ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో డాక్టర్ హెల్ప్ చేస్తుంది. డెలివరీ అయిన లిస్ట్ లో మినిస్టర్ భార్య తులసి ఉందని చెప్తుంది. ఈ కేసు డీల్ చేసింది డాక్టర్ చక్రవర్తి. ఆయన రావడం లేదు. తనకి అసిస్టెంట్ గా నీలవేణి నర్సు ఉందని కావ్యతో చెప్తుంది డాక్టర్ అనురాధ. మరొకవైపు నర్సు నీలవేణి ఇంకొక సిస్టర్ మాట్లాడుకుంటారు. ఈ గోల్డ్ చైన్ తీసుకున్నానని నర్సు అనగానే నేను చూడు పది లక్షలు పెట్టి తీసుకున్నానని నీలవేణి నర్సు అంటుంది.
అంత డబ్బు ఎక్కడిది అని నర్సు అడుగుతుంది. పెద్ద వాళ్లకు సాయం చేస్తే ఇలాంటివి బోలెడు అన్ని కొనొచ్చని నీలవేణి అంటుంది. అప్పుడే డాక్టర్, కావ్య వస్తుంది. అందుకేనా మినిస్టర్ కి హెల్ప్ చేసి పాపని మార్చావని కావ్య అనగానే నీలవేణి షాక్ అవుతుంది. నర్సు ని బెదిరించి కొడుతుంది కావ్య. దాంతో నీలవేణి నిజం చెప్తుంది. నా బిడ్డ పుట్టినప్పుడు ఎక్కడ పుట్టుమచ్చ ఉందని రికార్డు చేస్తారు కదా.. ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని డాక్టర్ ని కావ్య రిక్వెస్ట్ చేస్తుంది. మరొకవైపు పాప ఏడుస్తుంది. కావ్య ఇంకా ఇంటికి రాలేదని ఇంట్లో అందరు కోపంగా ఉంటారు. అప్పుడే రేఖ వచ్చి రోడ్డుపై ఎవరి పాప కన్పించినా నా పాప అంటూ వాళ్ళ వెంట వెళ్తుందట.. నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారని రేఖ అంటుంది. కావ్య ఎందుకు ఇలా చేస్తుందని అందరు బాధపడుతారు. ఆ తర్వాత డాక్టర్ ఫైల్ ఓపెన్ చేసే చూసేసరికి తన పాపకు కూడా పుట్టుమచ్చ ఉన్నట్లు రికార్డులో రాసినట్లు ఉందని డాక్టర్ చెప్తుంది. మినిస్టర్ దే హాస్పిటల్ కాబట్టి ఇలాంటి పని చేసాడు సారీ కావ్య ఇన్నిరోజులు నీ మాటలు నమ్మలేదని కావ్య అంటుంది.ఇక నీకు ఏ అవసరమున్నా నేను హెల్ప్ చేస్తానని డాక్టర్ చెప్తుంది.
ఆ తర్వాత మినిస్టర్ దగ్గరికి కావ్య వెళ్తుంది. కావ్యని చూసి అక్కడే ఉన్న రుద్రాణి పక్కకి దాక్కుంటుంది. కావ్య రిపోర్ట్స్ చూపించి నా బిడ్డని ఎందుకు మార్చారని అడుగుతుంది. ఓహ్ తెలిసిపోయిందా అని మినిస్టర్ అంటాడు. తరువాయి భాగంలో రాజ్ కి జరిగింది మొత్తం చెప్తుంది కావ్య. ఒకసారి ఆ బిడ్డని చూడండి మీకే అర్థం అవుతుందని రాజ్ ని తీసుకొని మినిస్టర్ ఇంట్లో ఉన్న పాప దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



