ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam2: తాతగారింటికి దీప.. నాన్నను చూసి ఎమోషనల్!

on May 30, 2025

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-370లో.. దీపకు నిజం చెప్పిన కార్తీక్.. ఆ తర్వాత అనసూయగారిని అడుగమని సలహా ఇస్తాడు. తీరా అనసూయతో మాట్లాడాక తట్టుకోలేక దీప గుడికి వెళ్లి గుడి ముందు దీపాలు వెలిగించి.. అక్కడే కూర్చుని ఏడుస్తుంటుంది. కార్తీక్ వెళ్లి దీపను ప్రేమగా పలకరించి.. నిజం తెలిసింది కదా.. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి దీపా.. లేదంటే మన తాత, సుమిత్ర అత్త, దశరథ్ మావయ్య అంతా ప్రమాదంలో పడతారు.. నిజానికి ఆ జ్యోత్స్న వాళ్లను చంపేసినా చంపేస్తుంది. కన్నతండ్రినే చంపాలనుకున్న మనిషి.. వాళ్లంతా తనకు ఓ లెక్క కాదు.. అందుకే నన్ను ఆ ఇంటికి వెళ్లనీ దీపా.. ఆ మనుషుల్లో మీపైన ఉన్న కోపాన్ని తగ్గిస్తాను.. నిన్ను ఆ ఇంటికి చేరుస్తానని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి దీప కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు కార్తీక్ పని చేయడానికి ఇంటికి రాలేదని జ్యోత్స్న ఎదురు చూస్తుంది. అప్పుడే వచ్చిన పారిజాతం.. నీ బావ రాడే.. ఆ దీప రానివ్వదు.. చూస్తూ ఉండు.. కావాలంటే వెయ్యి బెట్టు అని కామెడీగానే మాట్లాడుతుంది.

జ్యోత్స్న విసుగ్గా కార్తీక్ ఇంటికి వెళ్లిపోతుంది. అక్కడ జ్యోత్స్నని కాంచన తిడుతుంది. పోవే నా ఇంటికి రాకు నువ్వు.. నా కొడుకుని అంత బాధపెడుతున్నావా నువ్వు.. మమ్మల్ని ఇలా బతకనివ్వరా నువ్వు మీ తాతా అంటూ తిడుతూనే ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చింది.. బావ కోసం.. అది కూడా మరదలిగా రాలేదు.. యజమానిగా వచ్చానని అంటుంది. ఇంతలో కార్తీక్, దీప ఇద్దరు అక్కడికి వస్తారు. వెంటనే కార్తీక్ చేతులు కట్టుకుని అతి వినయం ప్రదర్శిస్తూ.. నమస్తే యజమానిగారు.. పని వాళ్ల కోసం అంత దూరం నుంచి కారేసుకుని రావడం దేనికో అని అడుగుతాడు. నా గొంతులో ప్రాణం ఉండగా కార్తీక్ బాబుని నేను రానివ్వనని ముందురోజు రాత్రి దీప అన్న మాటలు జ్యోత్స్నకి గుర్తొస్తాయి. దీపనే అయోమయంగా చూస్తుంటుంది. నేను ఇటు మాట్లాడుతుంటే తమరు నా భార్యను చూస్తారేంటీ ఓనర్ గారు అని కార్తీక్ అంటాడు. టైమ్ ఎంతైందని జ్యోత్స్న అడుగగా.. ఓర్నీ.. అది అడగటానికి ఇంత దూరం వచ్చారా అంటు కాసేపు ఎటకారంగా మాట్లాడతాడు కార్తీక్. నేనే అడ్డపడటం లేదు.. కార్తీక్ బాబు వస్తారని దీప అంటుంది దాంతో అటు జ్యోత్స్నతో పాటు.. కాంచన, అనసూయ కూడా షాక్ అయ్యి చూస్తుంటారు. కార్తీక్ బాబు శివనారాయణ తాతయ్యగారి ఇంటికి వెళ్తారు.. మీరు మౌనంగా ఉండండి అత్తయ్యా అని దీప అంటుంది. దాంతో వాళ్లు మౌనంగా ఉంటారు. నా భార్య చెప్పింది విన్నారుగా మీరు వెళ్లొచ్చని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. ఇక చేసేదేమీ లేక జ్యోత్స్న ఇంటికి పోతుంది. కార్తీక్ వెనుకే సైకిల్ మీద ఆ ఇంటికి వెళ్తుంటాడు. ఏంటి దీపా ఇది అని కాంచన అడుగగా.. కొన్ని రోజులు ఓపిక పట్టండి అత్తయ్యా అనేసి దీప వెళ్లిపోతుంది. దీప కార్తీక్ ఒకే మాట మీద ఉన్నారంటే వీళ్లిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు చెల్లమ్మా అని కాంచనతో అనసూయ అంటుంది. అది ఏమై ఉంటుందని కాంచన ఆలోచిస్తుంటుంది.

కాసేపటికి శివన్నారాయణ ఇంటికి దగ్గరికి దీప వస్తుంది. గుమ్మం దగ్గరే దీప నిలబడి.. ఇదే ఇంటికి అనాథగా రప్పించావ్.. ఇక ఈ ఇంటి బిడ్డగా అడుగుపెడుతున్నాను.. నాకు ఆటంకాలు రాకుండా చూడు గడప తల్లి అని దన్నం పెట్టుకుని మరీ కుడి కాలు పెడుతుంది. రావద్దని సుమిత్ర అరుస్తున్నా దీప వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ దీపా అని కార్తీక్ అంటుంటే.. ఇక్కడ అన్యాయం జరుగుతోంది న్యాయం కోరడానికి వచ్చానని దీప అంటుంది. ఏంటి ఆ అన్యాయమని  జ్యోత్స్న అడుగగా.. శివనారాయణ చెప్పనివ్వడు. దీపను బయటికి పొమ్మంటాడు. శివనారాయణ, జ్యోత్స్న, సుమిత్ర, పారిజాతం అంతా ఏకమై దీపను మాట్లాడనివ్వరు. దాంతో దశరథ్ మధ్యలో కలుగజేసుకొని దీప తరపున మాట్లాడతాడు. తను వచ్చింది కార్తీక్ భార్యగా.. తను చెప్పేది మనం వినాల్సిందే అని దశరథ్ అంటాడు. అమ్మా దీపా నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావని దీపను దశరథ్ అడుగుతాడు. ఆ మాటతో కార్తీక్ నిజాలు చెప్పిన సీన్ గుర్తొస్తుంది దీపకు. దశరథ్ నీ కన్నతండ్రి అన్న కార్తీక్ మాట గుర్తు రాగానే.. మనసులో నాన్నా అనుకుంటూ దీప చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.